|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి జులై 25 ఎపిసోడ్: పుట్టింటికి రేవతి- కూతురుని క్షమించని అపర్ణ- రుద్రాణికి చేజారిన విల్లా- స్వప్న కన్నీళ్లు

Published: 24-07-2025, 11:26 PM
బ్రహ్మముడి జులై 25 ఎపిసోడ్: పుట్టింటికి రేవతి- కూతురుని క్షమించని అపర్ణ- రుద్రాణికి చేజారిన విల్లా- స్వప్న కన్నీళ్లు

బ్రహ్మముడి సీరియల్‌లోని జులై 25వ ఎపిసోడ్‌లో రేవతి తన పుట్టింటికి తిరిగి రావడం, అపర్ణ ఆమెను క్షమించకపోవడం, రుద్రాణికి విల్లా లభించడం వంటి ఉత్కంఠభరిత ఘటనలు చోటుచేసుకుంటాయి. స్వప్న కూడా కన్నీళ్ళు పెడుతుంది.

రేవతి ఇంటికి తిరిగి రావడం

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న కూతురికి ఒక్కొక్కరు గిఫ్ట్స్ ఇస్తారు. అందరూ ఇచ్చారు మనం ఇవ్వకపోతే పరువు పోతుంది, మీరు తెస్తారని నేను తేలేదు అని రాజ్ కావ్యతో అంటాడు. ముందు టెన్షన్ పెట్టిన కావ్య తర్వాత తీసుకొచ్చానని గిఫ్ట్ చూపిస్తుంది. దాంతో వెంటనే లాక్కుని రాజ్ తాను తెచ్చినట్లు గిఫ్ట్ ఇస్తాడు.

కావ్య మరి నీ గిఫ్ట్ ఏదని అంతా అడిగితే ఆయన ఇచ్చింది నాదే అని అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఆయన, నేను ఇద్దరం ఇచ్చిన ఒక్కటే అని కావ్య అంటుంది. తర్వాత రాహుల్ మరి తండ్రివి నీ గిఫ్ట్ ఏదని అడిగితే తాను తెచ్చిన డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసి స్వప్న ఫైర్ అవుతుంది. కూతురుకి కొనే డ్రెస్సేనా అని నిలదీస్తుంది.

మీరెవరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నా దగ్గరున్న వాటితో ఇది తెచ్చాను అని రాహుల్ అంటాడు. అలా అనడానికి సిగ్గు లేదా. కష్టపడి పని చేసి తీసుకు రావచ్చుగా అని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. పని చేయాల్సిన కర్మ వాడికేంటీ. మా వాటా మాకు ఇస్తే బిజినెస్ చేసుకుంటూ కాలు మీద కాలేసుకుని కూర్చొంటాడు. అన్ని పవర్స్ లాగేసుకుంటే వాడేం చేస్తాడు అని రుద్రాణి అంటుంది.

మా డబ్బు మాకు ఇచ్చాక కూడా వాడు ఇలాగే ఉంటే అప్పుడు అనండి అని రుద్రాణి అంటుంది. సర్లే ఏడవకు. మీ నాన్న నా పేరు మీద రాసిన విల్లా ఉంది కదా. అది నీకు రాసిస్తా అని ఇందిరాదేవి అంటుంది. ఆ పని త్వరగా అయ్యేలా చూడు అని సంతోషంగా అంటుంది రుద్రాణి. ఏం అవసరం లేదు అమ్మమ్మ. నా కూతురు ఎదిగేసరికి అమ్మేస్తారు. నా కూతురు పెద్దది అయ్యాక దాని పేరు మీదే రాయండి అని స్వప్న అంటుంది.

అపర్ణ, రుద్రాణి మధ్య వివాదం

అలా విల్లా చేజారడంతో రుద్రాణి, రాహుల్ కోపంగా వెళ్తారు. డ్రెస్ గురించి టెన్షన్ అంతా పడుతుంటే నేను ఆల్రెడీ తీసుకున్నా అని కావ్య అంటుంది. మరోవైపు అపర్ణ ఇంటికి రావడం గురించి రేవతి ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్లాకా ఎలా రియాక్ట్ అవుతుందో అని రేవతి అంటుంది. నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. బాబును కూడా తీసుకెళ్దామంటే స్కూల్‌కు పంపావ్ అని జగదీష్ అంటాడు.

అక్కడ ఏమైనా నన్ను తిడితే వాడి మనసు బాధపడుతుంది. అందుకే వద్దనుకున్నా అని రేవతి అంటుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి త్వరగా రమ్మని చెబుతాడు. సరే అని రేవతి అంటుంది. అదే విషయం కావ్యకు చెబితే మీరు సూపర్ అని రాజ్‌ను హగ్ చేసుకుంటుంది కావ్య. అది ఇందిరాదేవి, అపర్ణ చూస్తారు. నువ్ ప్రపోజ్ చేస్తే అయిపోద్దిగా ఈ నాటకాలు అంతా ఎందుకు అని రాజ్‌ను అడుగుతారు.

దాంతో రాజ్ తప్పించుకుంటాడు. మరోవైపు స్వప్న కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అదంతా చూసి స్వప్న ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన ఇందిరాదేవి పిల్లలు చేసిన తప్పును సరిదిద్దడానికే కండిషన్స్ పెడతాం. పిల్లలు తప్పు చేస్తారు. పెద్దలు క్షమిస్తారు అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత కేక్ తీసుకొస్తారు. రావాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారని రేవతి గురించి చెబుతుంది కావ్య.

స్వప్న బాధ

ఒక ఐదు నిమిషాలు ఆగుదాం అని అపర్ణ అంటుంది. ఇంతలో ఆటోలో రేవతి వాళ్లు వస్తారు. రేవతిని చూసి అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. జరిగింది అంతా అపర్ణ గుర్తు చేసుకుంటుంది. కావ్య వెళ్లి లోపలికి తీసుకొస్తుంది. భయపడుతూనే పుట్టింట్లోకి అడుగు పెడుతుంది రేవతి. ఆగు.. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్ మళ్లీ ఇంటి గడప తొక్కుతావ్. అసలు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావ్ అని అపర్ణ అంటుంది.

అత్తయ్య మీరే పిలిచారు కదా అని కావ్య అంటుంది. ఇది అని తెలిస్తే అసలు పిలిచేదాన్ని కాదు. మీ ప్రాణాలు కాపాడిందో. కాపాడినట్లు నటించి ఇంటికి రావాలని ప్లాన్ చేసిందో ఎవరికి తెలుసు అని అపర్ణ అంటుంది. అమ్మా అని రేవతి పిలిస్తే నోర్మూయ్ అంటుంది అపర్ణ. తనను క్షమించొచ్చు కదా అని కావ్య అడుగుతుంది.

నేను ఎప్పటికీ క్షమించను. ఎప్పటికీ రానివ్వను. నువ్ చేసిన తప్పుకు నీ కొడుకు ఈ ఇంటికి దూరంగానే బతుకుతాడు. వాడు అమ్మమ్మ ఏమైందని అడిగితే చచ్చిపోయిందని చెప్పు అని అపర్ణ అంటుంది. దాంతో ఏడుస్తూ రేవతి , జగదీష్ వెళ్లిపోతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, ఈ ఎపిసోడ్‌లో రేవతి తన కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుంది, అపర్ణ ఆమెను క్షమించకపోవడం, రుద్రాణికి విల్లా లభించడం, స్వప్న కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.