
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ప్రకాశం పాత ప్రేమలేఖను ధాన్యలక్ష్మి చదవడంతో గొడవ మొదలైంది. రాజ్, కావ్య రొమాంటిక్ డిన్నర్‌కు వెళ్లగా, రాహుల్ బేరర్‌గా కనిపించి షాక్ ఇచ్చాడు. చివరగా నిజమైన రౌడీలు కావ్యను ఇబ్బంది పెట్టడం హైలైట్.
Key Points
ప్రకాశం పాత ప్రేమలేఖతో ధాన్యలక్ష్మికి కోపం వచ్చి చితకబాదిన వైనం.
రాజ్, కావ్యలకు రాహుల్ పనిచేస్తున్న రెస్టారెంట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు.
స్వప్న కోసం నిజాయితీగా సంపాదించాలనే ఉద్దేశంతో రాహుల్ బేరర్‌గా ఉద్యోగం చేయడం.
రాజ్ డమ్మీ రౌడీలను ఏర్పాటు చేసినా, నిజమైన రౌడీలు కావ్యను ఏడిపించి భయపెట్టడం.
ప్రకాశం ప్రేమలేఖపై ధాన్యలక్ష్మి ఆగ్రహం
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్‌లో ప్రకాశం లవ్ లెటర్ చాలా బాగా రాశాడని చదువుతుంది ధాన్యలక్ష్మీ. కానీ, చివరిలో లత అనే పేరు ఉంటుంది. ప్రకాశం చిన్నప్పటి లవ్ స్టోరీ బయటపడటంతో ధాన్యం చితకబాదుతుంది. కావ్యకు చీర కట్టి క్యాండిల్ లైట్ డిన్నర్‌కు రాజ్ తీసుకెళ్తాడు. అక్కడ బేరర్‌గా రాహుల్ పని చేస్తుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ ప్రేమలేఖను కావ్య, సుభాష్ లవ్ లెటర్‌ను అపర్ణ చదువుతారు. వీరిద్దరి కంటే మా ఆయన బాగా రాశారు అని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ధాన్యలక్ష్మీ చదువుతుంది. మంచి కవిత్వంతో ప్రేమలేఖలా ఉంటుంది. కానీ, చివరిలో ధాన్యలక్ష్మీ పేరుకు బదులు లత.. లత.. లత అని ఉంటుంది.
రెస్టారెంట్‌లో రాహుల్ కొత్త ఉద్యోగం
మరోవైపు రాహుల్ పని చేసేందుకు వెళ్తున్నట్లు రుద్రాణితో చెబుతాడు. నా కష్టార్జితంతో స్వప్నను పోషిస్తున్నట్లు చూపించాలి. మోసం చేసిన నిజాయితో చేయాలి. అందుకే నిజంగానే పనిచేస్తాను. కొడితో కుంభస్థలాన్నే కొట్టాలి. వెళ్లి రాజ్ ప్లేసులో కూర్చోవాలి అని రాహుల్ వెళ్లిపోతాడు. స్వప్న ఎక్కడికి అని అడిగితే నీ నమ్మకాన్ని కాపాడుకునేందుకు వెళ్తున్నా.. నీకో సర్‌ప్రైజ్ ఉంది. ఎదురు చూడు అని రాహుల్ అంటాడు.
కావ్య మూతి ముడుస్తుంది. దాంతో కావ్యకు రాజ్ చీర కడతాడు. కావ్యకు కుచ్చిళ్లు పెట్టి కావ్య అందాన్నే చూస్తుండిపోతాడు రాజ్. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. రాజ్ ముద్దు పెట్టుకోబోతుంటే కావ్య ఆపుతాడు. ఇది కాదు చీర కట్టడం అని కావ్య అనేసరికి రాజ్ ఉలిక్కిపడతాడు. మనిషికి కంట్రోల్ ఉండాలని కావ్య అంటుంది. దాంతో కోపంగా కావ్యకు చీర కడతాడు రాజ్.
రాజ్-కావ్యల రొమాన్స్, నిజమైన రౌడీల బెడద
కావాలనే ఇరికించినట్లు ఉందని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు ఆ లతను తీసుకొచ్చి మీకు దానికి అక్రమ సంబంధం లేదని నిరూపించాలి. అంతవరకు బెడ్డు లేదు, ఫుడ్ లేదని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు కారులో రాజ్, కావ్య వెళ్తుంటారు. రౌడీల నుంచి తనను కాపాడే కోరికను తీర్చాలని కావ్య అంటుంది. అందుకు డమ్మీ రౌడీలను ఏర్పాటు చేశాను అని రాజ్ అంటాడు.
ఆ రెస్టారెంట్‌లో రాహుల్ బేరర్‌గా చేస్తాడు. అది చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. ఏంట్రా ఇది అని అడిగితే.. నేను ఇక్కడ బేరర్‌ను సర్ ఆర్డర్ ఇవ్వండని రాహుల్ అంటాడు. తర్వాత రెస్టారెంట్‌లో నిజమైన రౌడీలు కావ్యను ఏడిపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తంగా, బ్రహ్మముడి నవంబర్ 14 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ధాన్యలక్ష్మి ఆగ్రహం నుండి రాహుల్ కొత్త అవతారం, కావ్యకు రౌడీల బెడద వరకు ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.


