|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్: స్వప్నను నాసిరకం చీరతో పడగొట్టిన రాహుల్- కావ్యకు రౌడీల వెయ్యి- రాహుల్ చేతికి 20 లక్షలు

Published: 14-11-2025, 10:38 PM
బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్: స్వప్నను నాసిరకం చీరతో పడగొట్టిన రాహుల్- కావ్యకు రౌడీల వెయ్యి- రాహుల్ చేతికి 20 లక్షలు

బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రాహుల్ రెస్టారెంట్‌లో బేరర్‌గా నటిస్తూ రాజ్, కావ్యలను ఆశ్చర్యపరిచాడు. కావ్యను నిజమైన రౌడీలు వేధించగా, రాజ్ వారిని చితకబాది తన పరాక్రమాన్ని చూపాడు. స్వప్నను నాసిరకం చీరతో రాహుల్ తన వలలో వేసుకున్నాడు.

Key Points

1

రాహుల్ రెస్టారెంట్‌లో బేరర్‌గా నటిస్తూ రాజ్, కావ్యలను ఆశ్చర్యపరిచాడు.

2

కావ్యను నిజమైన రౌడీలు వేధించగా, రాజ్ వారిని చితకబాది తన పరాక్రమాన్ని చూపాడు.

4

స్వప్నను నాసిరకం చీరతో బుట్టలో వేసి తన దారిలోకి తెచ్చుకున్నాడు రాహుల్.

రాహుల్ డ్రామా: రెస్టారెంట్‌లో బేరర్‌గా నాటకం

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 15 ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో రాహుల్‌ను బేరర్‌గా చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. రాహుల్ మాటలకు కావ్య నమ్మేస్తుంది. రాజ్ మాత్రం డౌట్ పడతాడు. కావ్యను నిజమైన రౌడీలు ఏడిపిస్తారు. రాజ్ వచ్చి వాళ్లను చితక్కొడతాడు. స్వప్నకు నాసిరకం చీర ఇచ్చి తన దారిలోకి తెచ్చుకుంటాడు రాహుల్.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యను రాజ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకెళ్తాడు. నన్ను అడక్కుండా నాకు ఇష్టమైంది తెలుసుకుని ఆర్డర్ తీసుకోవాలని కావ్య అంటుంది. ఇస్తాను అని బేరర్‌ను పిలిచి తనకు నచ్చింది ఆర్డర్ చేస్తాడు రాజ్ . అవి మీకు నచ్చినవి అని చెప్పి రాజ్‌కు నచ్చిన మరో లిస్ట్ ఆర్డర్ చేస్తుంది.

రాజ్, కావ్యలకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు రాహుల్ . నా భార్యా బిడ్డలను పోషించుకోడానికి ఇంతకంటే ఆప్షన్ దొరకలేదు. మళ్లీ నన్ను నమ్మరని తెలిసినప్పుడు ఇదే కరెక్ట్. నిజాయితీగా చేసే పనులతోనే గౌరవం వస్తుందని నువ్వే చెప్పావ్‌గా రాజ్. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీకు నాకు సంబంధం ఉన్నట్లు ఎవరికి చెప్పకండి. మీరు కస్టమర్స్ నేను బేరర్‌ను అంతే అని రాహుల్ డ్రామా ఆడి వెళ్లిపోతాడు.

రాహుల్‌లో ఎంత మార్పు వచ్చిందో చూశారా అని కావ్య అంటే.. నిజంగానే వచ్చిందనుకుంటున్నావా. నేను మాత్రం అనుకోవట్లేదు అని రాజ్ డౌట్ పడతాడు. మీరు చచ్చిన పామును అలాగే చంపుతారు అని చెప్పిన కావ్య హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్తుంది. అక్కడ ముగ్గురు రౌడీలు కావ్యను టీజ్ చేస్తారు. రాజ్ ఏర్పాటు చేసిన డమ్మీ రౌడీలు అనుకుని కోపరేట్ చేస్తుంది.

కావ్యకు రౌడీల వేధింపు: రాజ్ పరాక్రమం

కావ్య మీద చేయి వేస్తాడు రౌడీ. ఇదిగో వెయ్యి. తీసుకుని రా అని ఇంకొకడు అంటాడు. రేయ్ మీరు యాక్టింగ్ చేయాలిరా ఓవర్ యాక్టింగ్ కాదు. మిమ్మల్ని మా ఆయన డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశాడు నా కోరికలు తీర్చడానికి అని కావ్య అంటుంది. జాక్‌పాట్‌రా పెళ్లాం కోరిక తీర్చడానికి మొగుడే పూనుకున్నాడు అని రౌడీ లాగుతాడు. ఏవండి అని కావ్య పిలవడంతో రాజ్ వస్తాడు.

తాను బుక్ చేసిన రౌడీల కాదా అని ఫోన్ చేసి క్లారిటీ తెచ్చుకుంటాడు. రాజ్ బుక్ చేసిన డమ్మీ రౌడీలు టైర్ పంచర్ అయి మధ్యలోనే ఆగిపోయినట్లు చెబుతారు. కావ్య నిజమైన రౌడీలు అని భయపడుతుంది. నా భార్య కోరిక తీర్చడానికి ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్లున్నాడు. కళావతి నీ కోరిక బలమైనదే అని రౌడీలను చితక్కొడతాడు రాజ్.

రాహుల్ అంత ఈజీగా మారతాడని నేను అనుకోవట్లేదు అని రాజ్ అంటాడు. ఒక్కసారి చూడండి అని కావ్య అంటే.. సరేనని రాజ్ అంటాడు. మరోవైపు స్వప్న దగ్గరికి రాహుల్ వచ్చి గిఫ్ట్ తెచ్చినట్లు చెబుతాడు. కవర్ నుంచి చీర తీసి స్వప్నకు ఇస్తాడు. ఇలాంటి చీరలు కట్టవని తెలిసి నేను పని చేసిన డబ్బులతో ఇదే వచ్చిందని రాహుల్ అంటాడు.

స్వప్నను నాసిరకం చీరతో బుట్టలో వేసిన రాహుల్

ఏం పని చేశావని స్వప్న అడిగితే.. బేరర్‌గా చేసింది చెప్పి మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తాడు రాహుల్. నా కష్టార్జితంతో సంపాదించిన చీర ఇది. నీకు నచ్చకుంటే కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని డబ్బులు యాడ్ చేసి ఇంకోటి కొనిస్తాను అని రాహుల్ అంటాడు. దాంతో కరిగిపోయిన స్వప్న నిజాయితీగా ఏది చేసిన తక్కువ కాదు. నాకోసం ఇది చేశావ్ చాలు. థ్యాంక్స్ అని అంటుంది స్వప్న .

అక్కడ క్యాష్ డిపాజిట్ చేయాలి. రాజ్ ఇంకా రెడీ కాలేదని ఆగాను అని ప్రకాశం అంటాడు. స్వప్న చాలా సంతోషంగా వస్తుంది. అంత నాసీరకమైన చీర కట్టావేంటీ. చూడటానికి అస్సలు బాలేదని ధాన్యలక్ష్మీ అంటుంది.

తర్వాత టెండర్ గురించి చెప్పి 20 లక్షలు డిపాజిట్ చేయాలని, బ్యాంక్‌కు వెళ్లి డ్రా చేసుకురమ్మని రాహుల్‌కు చెక్ ఇస్తాడు రాజ్. అలా రాహుల్ చేతిలో 20 లక్షలు పెడతాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తంగా, ఈ ఎపిసోడ్‌లో రాహుల్ డ్రామా, కావ్య-రాజ్ మధ్య సంఘటనలు, స్వప్న పట్ల రాహుల్ మోసం ప్రధానాంశాలుగా నిలిచాయి. రాబోయే ఎపిసోడ్‌లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.