|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి అక్టోబర్ 1 ఎపిసోడ్: రాజ్ ప్లాన్ సక్సెస్.. కాపాడిన నర్స్.. కావ్యకు నిజం చెప్పేసిన కల్యాణ్

Published: 30-09-2025, 10:15 PM
బ్రహ్మముడి అక్టోబర్ 1 ఎపిసోడ్: రాజ్ ప్లాన్ సక్సెస్.. కాపాడిన నర్స్.. కావ్యకు నిజం చెప్పేసిన కల్యాణ్

బ్రహ్మముడి అక్టోబర్ 1 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కావ్య జ్యూస్‌లో అబార్షన్ మాత్రలు ఉన్నాయని తెలుసుకుని షాక్ అవుతుంది. రాజ్ ఆమెను అడ్డుకోవాలని చూసినా, కల్యాణ్ నిజం చెప్పేస్తాడు. ఇందిరాదేవి సహాయంతో కావ్య హాస్పిటల్‌కు వెళ్లగా, రుద్రాణి, రాహుల్ మరో కుట్రకు తెరలేపుతారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

కావ్య జ్యూస్‌లో అబార్షన్ మాత్రలు ఉన్నాయని ల్యాబ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటుంది.

2

రాజ్ ప్లాన్ సక్సెస్ అయినా, కల్యాణ్ కావ్యకు నిజం చెప్పేస్తాడు.

4

రుద్రాణి, రాహుల్ స్వప్నను మోసం చేయడానికి కొత్త ప్లాన్ వేస్తారు.

కావ్యకు అబార్షన్ నిజం తెలిసింది

బ్రహ్మముడి ఈరోజు అంటే 840వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రాజ్ తనకు కలిపిన జ్యూస్ లో అబార్షన్ ట్యాబ్లెట్లు ఉన్నాయని తెలుసుకున్న కావ్య అసలు నిజమేంటో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆమెను అడ్డుకోవడంలో రాజ్ సక్సెస్ అయినా.. ఇటు కల్యాణ్ మాత్రం దొరికిపోతాడు.

జ్యూస్‌లో ట్యాబ్లెట్లు కలిపారని తెలుసుకున్న కావ్య

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ రాజ్ తనకు కలిపిన మరో గ్లాస్ జ్యూస్ పై కావ్య డౌట్ పడటంతో మొదలవుతుంది. ఆ జ్యూస్ లో నిజంగానే ఏమైనా కలిపారా.. అసలు తనకు ఎందుకు ఇవ్వకుండా ఆగిపోయారు.. అది తాగితే తనకేమైనా అవుతుందని భయపడ్డారా అని కావ్య అనుకుంటుంది.

ఆ జ్యూస్ ను కావ్య టెస్టు కోసం ల్యాబ్ కు పంపిస్తుంది. దీని ద్వారా నిజం తెలుసుకోవడానికి కావ్య ప్రయత్నిస్తుంది. అందులో అబార్షన్ ట్యాబ్లెట్లు కలిపారని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో కావ్య షాక్ తింటుంది. అయితే రాజ్ నిజమే చెబుతున్నాడన్నమాట.. మరి తనకు ఎందుకు జ్యూస్ ఇవ్వలేదు అని లోలోపల అనుకుంటుంది.

డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలని డిసైడైన కావ్య

ఇంతలో తన దగ్గరికి వచ్చిన ఇందిరాదేవితో నిజం తెలుసుకోవడానికి ఓ అవకాశం వచ్చిందని అంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఆయన ఎందుకలా చేస్తున్నాడో తెలుస్తుందని చెబుతుంది. రాజ్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లడం కుదరదని, ఆయనకు ఏదైనా పని చెప్పి బయటకు పంపించండి ఇందిరను అడుగుతుంది. ఆమె సరే అంటుంది.

ఆ తర్వాత రాజ్ ను ఇందిరాదేవి బలవంతంగా బయటకు పంపిస్తుంది. తమ ఫామ్ హౌజ్ దగ్గర ఉన్న ఆయుర్వేద షాపులో మోకాళ్ల నొప్పులకు ఆయిల్ తెమ్మని చెబుతుంది. ఇష్టం లేకపోయినా రాజ్ వెళ్తాడు.

రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్

రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్

ఇటు రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్ వేస్తారు. స్వప్న దగ్గర తాను పూర్తిగా మారిపోయానన్న నమ్మకం కలిగించాలని రాహుల్ అనుకుంటాడు. స్వప్న దగ్గరకు వెళ్లగానే నువ్వు వచ్చి బాగా తిట్టు అని తల్లికి చెప్పి రాహుల్ వెళ్తాడు. అటు స్వప్న దగ్గరికి వెళ్లి నువ్వ చెప్పిన పనులన్నీ చేశాను.. పాపకు డైపర్ మార్చాను.. స్నానం చేయించానని అంటాడు. అది విని స్వప్న సంతోషించగా.. ప్లాన్ ప్రకారం రుద్రాణి వచ్చి రాహుల్ ను నానా మాటలు అంటుంది. దీంతో స్వప్న అతనికి అండగా నిలిచి అత్తను తిట్టి పంపిస్తుంది.

హాస్పిటల్‌కు కావ్య.. కంగారు పడిన కల్యాణ్.. రాజ్‌కు ఫోన్

రాజ్ వెళ్లగానే కావ్య కూడా హాస్పిటల్ కు బయలుదేరుతుంది. ఇంతలో స్వప్న ఆమెను ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే హాస్పిటల్ కు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇటు కల్యాణ్ కిందికి వచ్చి అన్నా, వదిన కనిపించడం లేదని స్వప్నను అడిగితే.. ఆమె అసలు విషయం చెబుతుంది.

దీంతో కల్యాణ్ కంగారు పడతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వదినకు అసలు విషయం తెలుస్తుంది.. ఎలా ఆపాలి అని కంగారు పడుతూ రాజ్ కు ఫోన్ చేసి విషయం చెబుతుంది. దీంతో రాజ్ ఆందోళన చెందుతాడు. తాను హాస్పిటల్ కు వెళ్తానని, నువ్వు మెడికల్ షాపుకు వెళ్లమని కల్యాణ్ తో చెబుతాడు.

డాక్టర్‌కు రాజ్ ఫోన్.. హెల్ప్ చేయలేనన్న డాక్టర్

హాస్పిటల్‌కు కావ్య.. కల్యాణ్ ఆందోళన

అయితే తాను ఉన్న ప్లేస్ నుంచి హాస్పిటల్ కు వెళ్లడానికి చాలా సమయం పడుతుందని, ఇంతలో కావ్య అక్కడికి వెళ్తే ప్రమాదమని రాజ్ అనుకుంటాడు. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేసి సాయం అడుగుతాడు. ఆమె మాత్రం కావ్యకు నిజం చెప్పేశారా అని రాజ్ ను అడుగుతుంది.

అది చెబుదామనే చేశాను.. ఇంకా చెప్పలేదు.. కావ్య అక్కడికి వస్తుంది.. మీరు కూడా ఆమెకు నిజం చెప్పొద్దు.. ఆమె ప్రాణం కాపాడటానికే అలా చేస్తున్నానని డాక్టర్ ను వేడుకుంటాడు. కానీ డాక్టర్ మాత్రం వినదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. నా వృత్తికి అన్యాయం చేయలేను అని రాజ్ కు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

రాజ్‌ను కాపాడిన నర్స్ శాంతి

ఇంతలో కావ్య హాస్పిటల్ కు వస్తుంది. అక్కడ నర్స్ శాంతి ఆమెను చూస్తుంది. వెంటనే రాజ్ కు ఫోన్ చేసి విషయం చెబుతుంది. నువ్వు అక్కడున్నావన్న విషయం మరచిపోయాను.. వెంటనే ఏదో ఒకటి చేసి డాక్టర్ దగ్గరికి కావ్య వెళ్లకుండా ఆపమని అడుగుతాడు.

ఆమె ప్రాణాలను కాపాడటానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో మొదట అంగీకరించని నర్స్.. తర్వాత సరే అంటుంది. అరగంట సేపు మాత్రం ఆపగలలని అంటుంది. రాజ్ సరే అంటాడు. అటు నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లబోయిన కావ్యను నర్స్ అడ్డుకొని బయట కూర్చోమంటుంది.

డాక్టర్ ను కలవకుండానే ఇంటికి వచ్చిన కావ్యను డాక్టర్ కలవలేదు కదా అని కల్యాణ్ అడుగుతాడు. అప్పుడే కల్యాణ్ పై కావ్యకు అనుమానం మొదలవుతుంది. రాజ్ తో కలిసి నాటకమాడుతున్నాడని తెలుసుకొని కల్యాణ్ ను నిలదీస్తుంది. నిజం చెప్పాలనుకున్నా.. అన్నయ్య అడ్డుకున్నాడని అంటాడు. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తంగా, బ్రహ్మముడి అక్టోబర్ 1 ఎపిసోడ్ డ్రామా, సస్పెన్స్‌తో నిండిపోయింది. కావ్య నిజం తెలుసుకోవడం, కల్యాణ్ పాత్ర, అలాగే రుద్రాణి కొత్త ప్లాన్ ప్రేక్షకుల ఉత్కంఠను పెంచాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏమి జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.