
బ్రహ్మముడి సీరియల్‌లో తాజా ప్రోమోలో, కావ్య గర్భవతి అని తెలుసుకున్న రాజ్ ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తాడు. కావ్య బిడ్డ తండ్రి ఎవరు అన్నది రహస్యంగా మిగిలిపోయింది. ఈ ప్రోమోలో కథలో ఎలాంటి మలుపులు వస్తాయో చూద్దాం.
Key Points
కావ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు రాజ్ ఆసుపత్రికి వస్తాడు.
కావ్య గర్భవతి అని తెలుసుకుని రాజ్ షాక్ అవుతాడు.
రాజ్ కావ్యను ఆమె బిడ్డ తండ్రి ఎవరో ప్రశ్నిస్తాడు.
నిందలను భరించలేక కావ్య నిజం చెప్పే అవకాశం ఉందా?
రాజ్‌కు షాకింగ్ ట్విస్ట్
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకుందామని హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు అపర్ణకు చెబుతుంది కావ్య. అదే సమయంలో రాజ్ కావ్య ఇంటికి వస్తుంటాడు. ఇంటి నుంచి కావ్య వెళ్లిపోవడం చూసిన రాజ్ ఆఫీస్‌కు వెళ్తుందేమో అనుకుని ఫాలో అవుతుంటాడు.
అయితే, దారిలో కావ్య ఆఫీస్‌కు వెళ్లకుండా వేరే రూట్ తీసుకోవడంతో షాక్ అయిన రాజ్ కళావతి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని మరింత క్యూరియాసిటీగా ఫాలో అవుతాడు. తీరా కావ్య హాస్పిటల్‌కు వెళ్లేసరికి మళ్లీ షాక్ అవుతాడు రాజ్. కావ్య రిసెప్షన్‌లో అడిగి డాక్టర్‌ను వెళ్లి కలుస్తుంది. డాక్టర్ కావ్యను చెక్ చేసి మీరు కంగారు పడాల్సిందేమి లేదు. బిడ్డ హెల్తీగా ఉంది అని చెబుతుంది.
డాక్టర్ మాటలు విన్న రాజ్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. మళ్లీ వాళ్ల మాటలు స్పష్టంగా వెంటాడు. బిడ్డ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెబుతుంటే కావ్య వింటూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. అదంతా విని కళావతి గారు కడుపుతో ఉన్నారా. ఇందుకా నాపై ప్రేమ ఉన్న రెజెక్ట్ చేసింది అని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రాజ్.
కావ్య గర్భవతి!
అక్కడే గోడకు ఒరిగి బాధతో విలపిస్తాడు. చెకప్ అయిన తర్వాత బయటకు వచ్చిన కావ్య అక్కడే బాధతో ఉన్న రాజ్‌ను చూసి షాక్ అవుతుంది. కావ్యను చూసిన రాజ్ ఏంటీ నిజం తెలిసిపోయిందని షాక్ అయ్యారా, భయపడుతున్నారా అని రాజ్ అంటాడు. దాంతో రాజ్ చేయి పట్టుకుని హాస్పిటల్ బయటకు తీసుకెళ్తుంది కావ్య. బయటకు వెళ్లిన తర్వాత కావ్య చేయి విదిలించుకుంటాడు రాజ్.
దానికి కావ్య కొంత షాక్ అవుతుంది. ఇప్పుడు దీనంతటికి ఏం చెబుతారు కళావతి గారు. మీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉండే ఉంటుందిగా చెప్పండి అని రాజ్ అంటాడు. దేని గురించి అంటున్నారో సూటిగా అడగండి అని కావ్య అంటుంది. కాస్తా ఎమోషనల్ అయిన రాజ్ సరే.. మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు. అసలు పెళ్లి కానీ మీరు తల్లి ఎలా అయ్యారు. దానికి కారణం ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు రాజ్.
నిజం బయటపడుతుందా?
అదంతా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కావ్య హార్ష్‌గా మాట్లాడుతుంది. నాకే అవసరం, నేను మీ చుట్టూ పిచ్చోడిలా తిరిగేది మీ ప్రేమకోసమే అని మీకు తెలుసు. నా మీద మీకు ప్రేమ ఉందని తెలుసు. అలాంటప్పుడు ఈ.. ఛీ.. ఇదంతా ఎలా జరిగింది. మీరు తప్పు చేశారా. యామిని చెప్పినట్లు అబ్బాయిలతో టైమ్ పాస్ చేసే అమ్మాయిల్లో మీరు ఒకరా అని కావ్యను నిందిస్తూ నిలదీస్తాడు రాజ్.
రామ్ లా ఉన్న రాజ్ మాటలు భరించలేకపోతుంది కావ్య . బిడ్డ పుట్టుకకు కారణం అయిన తండ్రే ఆ బిడ్డ ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుంటే తట్టుకోలేక పోయిన కావ్య నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి మీరే అని నిజం చెప్పేస్తుంది. దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు రాజ్. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
రాజ్ ప్రశ్నలకు కావ్య ఎలా స్పందిస్తుంది? ఆమె బిడ్డ తండ్రి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే బ్రహ్మముడి సీరియల్‌ను వీక్షించాల్సిందే.


