|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి: గాడిదపై రాజ్! రాహుల్ కుట్రతో కావ్యకు కష్టాలు, మోడల్ మాయం, దొంగ చేతికే తాళాలా?

Published: 17-12-2025, 10:04 PM
బ్రహ్మముడి: గాడిదపై రాజ్! రాహుల్ కుట్రతో కావ్యకు కష్టాలు, మోడల్ మాయం, దొంగ చేతికే తాళాలా?
  • మోడల్‌ను అడ్డుకొని రాహుల్ రెండో విజయం సాధించాడు.
  • మోడల్ కనిపించకుండా పోవడంతో కావ్య నగల షూటింగ్‌లో పాల్గొంది.
  • రాజ్, కావ్య కలిసి ఆఫీస్‌లో అమ్ముడుపోయిన వ్యక్తిని పట్టుకున్నారు.
  • రాజ్ అవమానంగా గాడిదపై ఉన్న ఫోటోను కావ్య చూపించింది.

బ్రహ్మముడి డిసెంబర్ 18 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రాహుల్ కుట్రలతో మోడల్ మాయం అవ్వగా, కావ్య నగల షూటింగ్‌లో మోడల్‌గా నిలిచింది. గాడిదపై రాజ్ అవమానం, దొంగ చేతికే తాళాలు వంటి ఆసక్తికర మలుపులతో ఈరోజు ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించింది.

రాహుల్ ప్లాన్: మోడల్ మాయం!

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో నగల డిజైన్స్ వేసి మోడల్‌తో షూటింగ్ ఏర్పాటు చేస్తాడు రాజ్. కానీ, మోడల్ షూట్‌కు వెళ్లకుండా పది లక్షలు ఇచ్చి ఆపేస్తాడు రాహుల్. ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే రెండో విజయం కూడా నాదే అంటాడు. గాడిదపై రాజ్ ఉన్న ఫొటోను చూపిస్తుంది కావ్య.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ఆఫీస్‌లో రాహుల్‌కు అమ్ముడుపోయిన వ్యక్తిని రాజ్, కావ్య పట్టుకుంటారు. నిన్ను పట్టుకోవాలనే డిజైన్స్ వేసినట్లు అబద్ధం చెప్పాను. చాలా నిరాశపడినట్లున్నావ్ అని కావ్య అంటుంది. అతన్ని రాజ్ కొట్టి పోలీసులకు అప్పజెబుతాడు. తర్వాత కొద్దిసేపు సస్పెన్స్‌లో పెట్టిన దొంగను పట్టుకోవడంలో నన్ను మించిపోయావ్ అని రాజ్ అంటాడు.

చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అతి కష్టంగా అంటాడు. నేరం చేసినవాళ్లు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతారు. వాళ్లను మేము పట్టుకుంటాం. మీ పాప బతికే ఉందని మీ భార్యకు చెప్పండి అని అప్పు చెబుతుంది. అశోక్ వెళ్లిపోతాడు. అశోక్ తేడాగా ఉన్నాడని అప్పు, కానిస్టేబుల్ మాట్లాడుకుంటారు. అశోక్‌ను ఫాలో అవ్వమని కానిస్టేబుల్‌కు చెబుతుంది అప్పు .

మరోవైపు రాత్రి ఇంటి బయట కావ్య డిజైన్స్ వేస్తుంది. రాజ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. కావ్య వేసిన డిజైన్స్ యావరేజ్‌గా ఉందంటాడు, దీనికంటే శ్రుతి డిజైన్సే బెట్ అని రాజ్. దాంతో కావ్య అలిగి వెళ్లిపోతుంది. తర్వాత కావ్యను రాజ్ బతిమిలాడుతాడు. అయినా కావ్య వినకపోవడంతో గిలిగింతలు పెడతాడు రాజ్. దాంతో శ్రుతికి కాల్ చేసి నీ డిజైన్స్ దరిద్రంగా ఉన్నాయి, మా భార్య వేసిన డిజైన్స్ బాగున్నాయని చెప్పాలని కావ్య అంటుంది.

గాడిదపై రాజ్: కావ్య ఏం చేసింది?

ఆ మాటలు రాహుల్ వింటాడు. అది అస్సలు జరగనివ్వను కదా. ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే చాలు రెండో విజయం కూడా నాదే. ఈ రాహుల్ ఏం చేస్తాడో చూడు అని రాహుల్ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య వేసిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయంటాడు రాజ్. మరుసటి రోజు ఉదయం జ్యూవెల్లరీ షూటింగ్ జరుగుతుంటుంది. బాగా రావాలని, యాడ్ బాగుండాలని డైరెక్టర్‌తో చెబుతాడు రాజ్.

మోడల్ గురించి డైరెక్టర్ అడుగితే శ్రుతి ని అడుగుతాడు రాజ్. మోడల్ లాస్య మేనేజర్‌కు కాల్ చేస్తే మేడమ్ కనిపించట్లేదని చెబుతాడు. అదే విషయం రాజ్‌కు శ్రుతికి చెబుతుంది. ఎలాగైన మోడల్‌ను పట్టుకుని ఇవాళ షూటింగ్ చేయాలంటాడు రాజ్. మరోవైపు మోడల్ లాస్యతో నవ్వుతుంటాడు రాహుల్. యాడ్ ఎగ్గొట్టినందుకు లాస్యకు పది లక్షల క్యాష్ ఇస్తాడు రాహుల్.

డైరెక్టర్ వెళ్లిపోతాడు. రెండు రోజుల్లో మార్కెట్‌లోకి డిజైన్స్ పంపించాలి. ఏదో ఒకటి చేయాలని రాజ్ ఆలోచిస్తాడు. మరోవైపు పాప మిస్ అయిన రోజు సీసీ కెమెరా టీవీ చూస్తుంది అప్పు. ఎప్పుడు ఐదు నిమిషాల్లో ముందుడే రేణుక ఆరోజు లేట్ అయింది అన్ని చాలా ప్రశ్నలు వేసుకుంటూ అనుమానిస్తుంది అప్పు. ఇంతలో అంజలి ఫాదర్ రిపోర్ట్స్ అని కానిస్టేబుల్ తీసుకొస్తాడు.

దొంగ చేతికే తాళాలు: అసలు నిజం!

ఆ రిపోర్ట్స్ చూసిన అప్పు ఏంటిది రాజన్న అని అంటుంది. నిజంగానే ఆ అశోక్ తేడా మనిషి. ఆ రేణుక, అశోక్ ఇద్దరు మనల్ని మోసం చేశారు అని కానిస్టేబుల్ రాజన్న అంటాడు. అవును, వెంటనే అశోక్, రేణకును నా ముందు ఉంచు అని అప్పు అంటుంది. మరోవైపు మోడల్స్ కోసం రాజ్ ట్రై చేస్త ఫ్రస్టేట్ అవుతాడు. కావ్య వచ్చి రాత్రి డిన్నర్‌కు ఏం చేయాలని అడుగుతుంది.

నేను మోడ్రన్ డ్రెస్ వేసుకోవడం ఏంటీ, మార్చండి అని కావ్య అంటుంది. అయితే, దీన్ని నా డీపీగా పెట్టుకుంటాను అని రాజ్ అంటాడు. తర్వాత డిన్నర్‌లో షూటింగ్ గురించి రాహుల్ అడిగితే.. మోడల్ హ్యాండ్ ఇచ్చిందని చెబుతాడు. మరి మోడల్ ఎలా లేకపోతే ఎలా అని రాహుల్ అంటే మోడల్ ఉంది.

కావ్యే మోడల్ అని రాజ్ చెబుతాడు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు రాహుల్‌కే కావ్య మోడల్ అని చెబుతాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తంగా, బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ రాహుల్ కుట్రలు, రాజ్ అవమానం, కావ్య చాతుర్యం కలగలిపి సాగింది. తర్వాత ఎపిసోడ్‌లో ఈ ట్విస్టులు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.