
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 13 ఎపిసోడ్ లో రేవతి యొక్క భావోద్వేగాలు, అపర్ణ ఇచ్చిన ట్విస్ట్, రాజ్ మరియు కావ్య మధ్య రొమాన్స్ వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పు కూడా ఒక కీలక సమస్యను ఎదుర్కొంటుంది.
Key Points
రేవతి స్వరాజ్ తల్లిదండ్రులను ప్రేమగా చూడటం చూసి భావోద్వేగానికి లోనవుతుంది.
రుద్రాణి రేవతి ముసుగును తొలగించే ప్రయత్నం చేస్తుంది.
అప్పు తన అక్కకు గర్భం గురించి చెప్పేందుకు ఇబ్బంది పడుతుంది.
రేవతి యొక్క భావోద్వేగ క్షణాలు
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వరాజ్‌ను తల్లిదండ్రులు ప్రేమగా చూడటంతో ఎమోషనల్ అవుతుంది రేవతి. ఇన్నాళ్లు వాడిని వారికి దూరంగా ఉంచానని బాధపడుతుంది. రాజ్, కావ్య ఓదారుస్తారు. రేవతి కన్నీళ్లు తుడుస్తాడు రాజ్ . మళ్లీ కొంగు వేసి రేవతిని లోపలికి తీసుకెళ్తారు. రాహుల్ అందరికి అప్పడాలు వేస్తాడు.
ఏమైనా పని చేయడం చాలా కష్టం అంటాడు రాహుల్. ఏమైంది రాధ ఎందుకు వెళ్లిపోయావ్ అని అపర్ణ అడిగితే.. వాళ్ల అమ్మ గుర్తొచ్చిందట అని కావ్య చెబుతుంది. ఎందుకు కలిసి ఉండట్లేదా, గొడవ అయిందా అని రుద్రాణి అడిగితే.. లేదు దూరంగా ఊరిలో ఉన్నారని, తనకు వాళ్ల తల్లి గుర్తొచ్చిందని రాజ్ కవర్ చేస్తాడు. మీ అమ్మ నాన్నలు దూరంగా ఉన్నారని బాధపడకు నేను కూడా మీ అమ్మే అనుకో అని అపర్ణ అంటుంది.
భోజనాలు అయ్యేసరికి ఆ పరదా ఎలా తొలగిస్తానో చూడు అని రుద్రాణి అనుకుంటుంది. కల్యాణ్, అప్పు స్వీట్ తినిపించుకుంటారు. వాళ్లు చూడు పబ్లిక్‌లో ఎలా రొమాన్స్ చేసుకుంటున్నారో. వాళ్లను చూసి నేర్చుకో అని కావ్యను తినిపించమంటాడు. లేదంటే గట్టిగా అరుస్తానని రాజ్. అరవాల్సిన అవసరం లేదు మా అందరికి వినిపించింది. అమ్మా కావ్య ఆ స్వీట్ తినిపించమ్మా. లేకుంటే మిమ్మల్ని తిననిచ్చేలా లేడని, అందరు కళ్లు మూసుకోండి అని సీతారామయ్య అంటాడు.
దాంతో కోపంగా రాజ్‌కు స్వీట్ తినిపిస్తుంది కావ్య. అలా, రాజ్, కావ్య, కల్యాణ్, అప్పు రొమాన్స్‌లో పోటీ పడతారు. తర్వాత నీళ్లు పోస్తున్నట్లు చేసి ముసుగు తీసేలా రేవతి మొహంపై నీళ్లు కొడుతుంది రుద్రాణి. అయ్యో చూసుకోలేదు. ముసుగు తీసేయ్ తీసేయ్ అని బలవంతం చేస్తుంది. అపర్ణ వద్దని వారిస్తుంది. రేవతిని ఫ్రెష్ అవ్వమని గదిలోకి పంపిస్తుంది అపర్ణ.
రుద్రాణి యొక్క ప్రయత్నం
ఇందిరాదేవి పిలిచి పనులు చేయమని చెబుతుంది. మరోవైపు అక్కకు నిజం ఎలా చెప్పాలో తెలియట్లేదు అని బాధపడుతుంది అప్పు. ఇంతలో కావ్య రాజ్ కోసం వెతుక్కుంటూ వస్తుంది. రాజ్ ఫోన్‌లో మాట్లాడుతుంటే మజ్జిగ ఇచ్చేందుకు అరుస్తుంది. మజ్జిగ తీసుకుని రాజ్ పూర్తిగా తాగేస్తాడు. దాంతో కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదని వెళ్లిపోతుంది.
మెట్లపై స్లిప్ అయి కావ్య పడబోతుంటే రాజ్ వచ్చి పట్టుకుంటాడు. జాగ్రత్తగా ఉండమని తిడతాడు రాజ్. దాంతో పుట్టబోయే బిడ్డ గురించి కావ్య ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. బిడ్డకు ఏం జరగనివ్వను. నా ప్రాణాలు అడ్డు వేసైనా కాపాడుకుంటానని అంటుంది. ఇంతల చూస్తున్న అక్కకు నీ కడుపు పండదని ఎలా చెప్పను అని అప్పు బాధపడుతుంది.
తర్వాత రుద్రాణి పార్టీ అరెంజ్ చేస్తుంది. తీసిన చిట్టీల్లో వచ్చింది ఇంట్లోవాళ్లు చేయాలి. లేకుంటే నేను ఇచ్చే పనిష్‌మెంట్ అనుభవించాలని రుద్రాణి చెబుతుంది. సీతారామయ్యకు డైలాగ్ వస్తే చిన్ననాటి సంఘటన చెబుతాడు. చాలా కాలం తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలవడాన్ని మాటల్లో చెబుతాడు. అది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సీతారామయ్య డైలాగ్‌కు అంతా లేచి చప్పట్లు కొడతారు.
రాజ్ మరియు కావ్య ప్రేమ
తర్వాత స్వప్న తీస్తుంది. భర్త అలిగితే భార్య బుజ్జగించాలి అని ఉంటే.. భార్య అలిగితే భర్త బుజ్జగించాలని అబద్ధం చెబుతుంది స్వప్న. దాంతో కోపాలు చాలు శ్రీమతి గారు అనే పాటతో రాహుల్ బుజ్జగిస్తాడు. ఇద్దరు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తారు. తర్వాత అందరూ అయిపోయాక రేవతిని పిలుస్తుంది. డ్యాన్స్ వస్తే రుద్రాణినే చేసినట్లు చేసి రేవతి ముసుగు తీస్తుంది.
అంతా రేవతిని చూసి షాక్ అవుతారు. రేవతి నువ్వేంటి ఇక్కడ. అసలు ముసుగు వేసుకుని ఎందుకు వచ్చావ్. ఏం చేద్దామని వచ్చావ్ అని రుద్రాణి డ్రామా స్టార్ట్ చేస్తుంది. అందరికి దూరంగా అక్క ఒక్కతో ఉండటం నాకు నచ్చలేదు. మనతోనే ఉండనిద్దాం అని రాజ్ ఉంటాడు.
ఏంటీ రాజ్ ముసుగు వేసుకుని వచ్చి మోసం చేసిన కూడా రేవతిని క్షమించాలి అంటావా అని రుద్రాణి పుల్లలు పెడుతుంది. ముసుగు వేసుకొచ్చింది రేవతి అని నాకు ముందే తెలుసు అని అపర్ణ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. రుద్రాణి తెగ షాక్ అయిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
అపర్ణ ఇచ్చిన ట్విస్ట్ తో బ్రహ్మముడి సీరియల్ కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. రేవతి, రాజ్, కావ్య మరియు అప్పుల జీవితంలో కొత్త మలుపులు రానున్నాయి.


