
బ్రహ్మముడి సీరియల్‌లోని 816వ ఎపిసోడ్‌లో కావ్య ప్రెగ్నెన్సీ కారణంగా ప్రమాదంలో పడుతుంది. యామిని చేసిన కుట్రలను రాజ్‌కు కావ్య వివరిస్తుంది. రాజ్ ఆవేశంతో యామిని ఇంటికి వెళ్లి, ఆమెను క్షమించి వదిలేస్తాడు.
Key Points
కావ్య ప్రెగ్నెన్సీతో ప్రమాదంలో ఉన్నట్లు డాక్టర్ చెప్పడం
యామిని చేసిన కుట్రను రాజ్‌కు కావ్య వివరించడం
యామిని మారని స్వభావం
కావ్య ప్రెగ్నెన్సీ ప్రమాదం
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 816వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజ్ కు యామిని గురించి కావ్య చెప్పడం, అతడు ఆవేశంగా వాళ్ల ఇంటికి వెళ్లడం, ఆమె కాళ్లు పట్టుకొని మొసలి కన్నీరు కార్చడం లాంటి సీన్లతో సాగింది. అయితే కావ్యకు ప్రెగ్నెన్సీతో ముప్పు అని చివర్లో ఇచ్చిన ట్విస్టు మరో మలుపు తిప్పింది.
రాజ్‌కు యామిని గురించి చెప్పిన కావ్య
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ కావ్యకు రాజ్ కాఫీ తెచ్చివ్వడంతో మొదలవుతుంది. ఇంట్లో వాళ్లకు చూపించాల్సిన అవసరం లేదులే అని కావ్య అనడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత కాసేపు రాజ్, కావ్య మధ్య కాఫీ రొమాన్స్ సాగుతుంది. అసలు కాఫీ ఎలా తాగాలో కావ్యకు రాజ్ రొమాంటిక్ గా చెబుతాడు.
అతని ప్రేమ చూసి పొంగిపోయిన కావ్య ఆ యామిని తనను ఎక్కడ దూరం చేస్తుందో అన్న భయం కలిగిందని రాజ్ తో అంటుంది. అప్పుడే ఆ యాక్సిడెంట్, యామిని ఆడిన నాటకం, తన ప్రెగ్నెన్సీని నిలదీసేలా ఉసిగొల్పిన తీరును రాజ్ కు కావ్య వివరిస్తుంది. దీంతో రాజ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆ యామినిని చంపేస్తానంటూ బయలుదేరుతాడు.
రాజ్ కాళ్లు పట్టుకున్న యామిని
రాజ్ యామినిని ఎదుర్కోవడం
కావ్య ఎంత వద్దని వారించినా రాజ్ వినడు. దీంతో అతడు ఏం చేస్తాడో అన్న భయంతో కావ్య మరో కారులో అతని వెంటే యామిని ఇంటికి వెళ్తుంది. రాజ్ ఆవేశం చూసి యామిని వెళ్లి దాక్కోమని తల్లి చెప్పినా ఆమె వినదు. రాజ్ రాగానే అతని కాళ్లపై పడుతుంది. తాను చాలా పెద్ద తప్పు చేశానని, నీపై ప్రేమే తనతో ఇదంతా చేయించేలా చేసిందని యామిని మొసలి కన్నీరు కారుస్తుంది.
నీకోసం పిచ్చిదానిలో మారిపోయి, నీ వెంటే తిరిగి, నీ యాక్సిడెంట్ నాకు దేవుడు ఇచ్చిన రెండో అవకాశంలా భావించి ఆ నాటకం ఆడినట్లు యామిని చెబుతుంది. దీంతో కావ్య కూడా ఆవేశంగా ఇప్పటికీ ప్రేమ అంటూ నాటకం ఆడటం ఆపు అని గట్టి వార్నింగ్ ఇస్తుంది.
అటు రాజ్ కూడా యామినికి వార్నింగ్ ఇస్తాడు. కాళ్లు పట్టుకున్నావని కనికరించి వదిలేస్తున్నాను.. మాకు శ్రీశైలం వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని తెలుసు.. కానీ ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించావని తెలిస్తే మాత్రం నిన్ను, నీ కుటుంబాన్ని వదలను.. కావ్య నా భార్య.. ఆమెను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు అని రాజ్ అంటాడు.
ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోతారు. దీంతో యామిని తల్లి ఊపిరి పీల్చుకుంటుంది. రాజ్ వచ్చిన తీరు చూస్తే ఏం చేస్తాడో అని భయపడ్డానని, ఇకనైనా అతన్ని వదిలేయమని చెబుతుంది. కానీ యామిని బుద్ధి మాత్రం మారదు. రాజ్ ను, అతడి కుటుంబాన్ని అసలు వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది.
కారులో రాజ్‌కు క్లాస్ పీకిన కావ్య
యామిని మారని స్వభావం
అటు కారులో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రాజ్ కు కావ్య క్లాస్ పీకుతుంది. మీరు వెళ్లిన ఆవేశంలో యామిని చంపేస్తారనుకుంటే కనీసం చెంప దెబ్బ కూడా కొట్టలేదు.. ఈ మాత్రం దానికే అంత బిల్డప్ ఇవ్వాలా.. దాని తల పచ్చడి చేసేయాల్సింది అని కావ్య ఆవేశ పడుతుంది.
అంటే ఇందాకటి నుంచి నువ్వు కోపంగా ఉంది యామినిని ఏమీ అననందుకా అని రాజ్ అంటాడు. అవునని కావ్య అనడంతో ఇంత వైల్డ్ గా ఉన్నావేంటి.. టెర్రరిస్టు గ్రూపు నుంచి తప్పిపోయి వచ్చావా అని రాజ్ అంటాడు.
సీత కోసం రాముడు బంగారు లేడీని తేవడానికి వెళ్లాడు.. మీరు ఈ మాత్రం చేయలేరా అని కావ్య అంటుంది. ఆ బంగారు లేడీ వల్లే సీత అన్ని రోజులు ఆ రాముడికి దూరంగా ఉంది అంటూ కావ్యను రాజ్ కూల్ చేస్తాడు. పెళ్లయినప్పటి నుంచి నీతో నేను సరిగా లేను.. తర్వాత యాక్సిడెంట్, గతం మరచిపోవడం, నీకు పెళ్లి కాలేదని తెలిసి ప్రేమ అంటూ వెంటపడటం, నీకు ప్రెగ్నెన్సీ అని తెలియడం.. ఇలా ఏదేదో జరిగిపోయిందని రాజ్ అంటాడు.
ఇక నుంచైనా నిన్ను బాగా చూసుకుంటానని, నీమీద ప్రేమతోనే ఆ యామినిని వదిలేశానని చెబుతాడు. ఆ రాముడు సీతకు అన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నాడో తెలియదు కానీ.. ఇక నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనేమో అనిపిస్తుంది అనడంతో కావ్య కరిగిపోతుంది. అటు ఇంట్లో వాళ్లందరూ వినాయక చవితి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్న సమయానికి ఇంటికి వచ్చిన కావ్య కూడా తానూ అదే అనుకుంటున్నట్లు చెబుతుంది.
అయితే కావ్య రిపోర్టులో సమస్య ఉందని, ఆమె గర్భసంచి వీక్ గా ఉండటం వల్ల 9 నెలలు బిడ్డను మోస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని అప్పు, కల్యాణ్ లకు డాక్టర్ చెబుతుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, యామిని తన తప్పులను అంగీకరించకుండా, రాజ్ మరియు కావ్యల జీవితంలో ముప్పుగా కొనసాగుతుంది. కావ్య ప్రెగ్నెన్సీ ప్రమాదం కథానాయిక జీవితంలో కొత్త మలుపు తీసుకురానుంది.


