
📌 Key Points
- రేఖ పెళ్లి తర్వాత అపర్ణ ఇంటికి వచ్చి దౌర్జన్యం!
- పిల్లలను, భర్తను చంపేస్తానని బెదిరింపులు!
- కావ్య బిడ్డ పేరు మీద ఆస్తి అని అపర్ణ ప్రకటన!
- ఆస్తి పత్రాలపై సంతకం చేసిన అపర్ణ!
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్! రేఖ తన ప్రతాపం చూపిస్తూ ఇంటిని గడగడలాడిస్తోంది. ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రేఖ ఆటలు సాగుతాయా? అపర్ణ తీసుకున్న నిర్ణయం ఏమిటి? తెలుసుకోవాలంటే చదవండి!
రేఖ ఆగడాలు: ఇంట్లో విధ్వంసం!
Brahmamudi Serial February 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 28 ఎపిసోడ్‌లో తన వెంట పడిన భూషణ్‌ను పెళ్లి చేసుకున్న రేఖ అపర్ణ ఇంటికి అడుగు పెట్టి దౌర్జన్యం చేస్తుంది. పిల్లలను, మొగుడుని చంపేస్తానని బెదిరిస్తుంది. కానీ, ఆస్తి మాత్రం కావ్య బిడ్డ పేరు మీద ఉందని అపర్ణ చెప్పడంతో షాక్ అవుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆగమని అపర్ణ అరుస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావని, అడుగు లోపల పడితే చంపేస్తానని బెదిరిస్తుంది అపర్ణ. కానీ, అది లెక్క చేయకుండా రేఖ ఇంట్లోకి వస్తుంది.
నీ కొడుకు తలను బద్ధలు కొట్టి చంపిన నా తల్లి రుద్రాణి గుర్తుందా. తన కూతురుని నేను ఎలాంటిదాన్నో ఊహించలేవా. నేను నీ వారసురాళ్లను చంపేస్తే చూస్తూ ఊరుకోగలవా అని బెదిరిస్తుంది రేఖ. భర్తకు సైగ చేయడంతో అతను వెళ్లి అపర్ణ మనవరాళ్లపై కత్తి పెడతాడు. అంతేకాకుండా సుభాష్‌ను రేఖ వదిన కర్రతో కొడుతుంది. భర్త, వదినతో కలిసి రేఖ దౌర్జన్యం చేస్తుంది.
ఆస్తి కోసం అపర్ణపై ఒత్తిడి!
పిల్లలు, మొగుడుని చంపేస్తానని, నోరు మూసుకుని ఆస్తి పేపర్స్ మీద సంతకం చేయమని బెదిరిస్తుంది రేఖ. నేను సంతకం చేస్తే ఆస్తి కాదు కదా ఇంట్లో ఆవగింజ కూడా నీకు రాదు అని అపర్ణ చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు.
దాంతో మమ్మల్ని మోసం చేశావా అని రేఖపైనే రివర్స్ అవుతారు తన భర్త, వదిన. ఇప్పుడేం చేస్తారని నిలదీస్తారు. ఇలాంటి దాన్ని నమ్ముకుంటే మీరు కూడా జైలుకెళ్లి చిప్పకూడు తినాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అపర్ణ అంటుంది. ఇది చెబితే వినాలా అని అపర్ణ కర్రపై కొడుతుంది. ఆ పాపకు పాతికేళ్లు వచ్చాక సంతకం పెట్టించుకుందాం అంటుంది.
ఈ పాతికేళ్లు నువ్వు గార్డియన్‌గా ఉండలేవు కానీ సంతకం పెట్టు ఇల్లు ఆస్తి నేను చూసుకుంటాను రేఖ అంటుంది. సంతకం పెట్టకని సుభాష్ అంటాడు. ఈ సంతకం చేయకపోతే పిల్లలతో పాటు నీ మొగుడు కూడా చస్తాడు అని వదినకు కర్ర ఇస్తుంది రేఖ. పిల్లలపై భూషణ్ కత్తి పెడతాడు. ఇద్దరు చంపేయాలని చూస్తారు. దాంతో వద్దని అపర్ణ అంటుంది.
కావ్య బిడ్డ పేరు మీద ఆస్తి?
స్వరాజ్ తింటాడు. మరోవైపు రేఖ చేసింది అంతా అపర్ణ తలుచుకుంటుంది. అపర్ణ చేసిన సంతకం గురించి సుభాష్ బాధపడుతాడు. పవర్ మొత్తం రేఖ చేతిలోకి వెళ్లిపోయింది. రుద్రాణి ఏంటో తెలియక తప్పు చేశాం. ఇప్పుడు రేఖ గురించి తెలిసి తప్పు చేశావ్ అని సుభాష్ అంటాడు. మిమ్మల్ని కాపాడుకునేందుకు ఇంకో మార్గం కనిపించలేదని అపర్ణ అంటుంది.
పోలీసులకు చెప్పి జైలుకు పంపించిన మళ్లీ వస్తుంది. కంటికి కనిపించకుండా ఏదోటి చేస్తుంది. రుద్రాణి అలాగే చేసిందిగా అని అపర్ణ అంటుంది. పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నువ్వే చూసుకోవాలి. కానీ, నేనే నీకు బారంగా మారాను అని సుభాష్ అంటాడు. మీరు నాకు బారం ఏంటని అపర్ణ అంటుంది. మరోవైపు స్వరాజ్ రాత్రి కలలో బాంబ్ బ్లాస్ట్ గుర్తొచ్చి అమ్మా అంటూ అరుస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ మరింత ఉత్కంఠగా మారింది. అపర్ణ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? రేఖ ప్లాన్స్ ఏమవుతాయి? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి!


