
📌 Key Points
- బ్రహ్మముడి సీరియల్‌లో స్వరాజ్ ఎంట్రీతో కథనం మలుపు తిరిగింది, రాజ్ బావలా ఉండటంతో రేఖ షాక్!
- ఐశ్వర్య నెక్లెస్ దొంగతనం బయటపడటంతో దుగ్గిరాల ఇంట్లో కలకలం, అసలు దోషి ఎవరు?
- ఇందు ప్లాన్ ద్వారా రేఖ ఆట కట్టించడానికి ప్రయత్నాలు, ఉత్కంఠ రేపుతున్న సీరియల్.
- దుగ్గిరాల ఇల్లు చూసి గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్న రాజ్, లక్కీతో వాగ్వాదం!
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. స్వరాజ్ దుగ్గిరాల ఇంటికి రావడంతో రేఖ ఒక్కసారిగా షాక్ తింటుంది. అసలు ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఐశ్వర్య దొంగతనం కూడా వెలుగులోకి రావడంతో కథనం రసవత్తరంగా మారుతోంది.
దుగ్గిరాల ఇంటికి స్వరాజ్ రాక – రేఖ షాక్!
Brahmamudi Serial March 27th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 27వ తేది ఎపిసోడ్‌లో రెండు నెక్లెస్‌ల దొంగతనం గురించి ఇందును నిలదీస్తుంది రేఖ. ఇంతలో లక్కీతోపాటు స్వరాజ్ సొంతింటికి వస్తాడు. రాజ్‌ను చూసి ఉలిక్కిపడుతుంది రేఖ. రాజ్ బావలా ఉన్నాడేంటని వణికిపోతుంది. ఐశ్వర్య నెక్లెస్ తీసి ఇస్తాడు లక్కీ.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అందరూ ఇందు కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఇందు వస్తుంది. ఎందుకు చేశావ్ ఈ పని అని రేఖ అడిగితే.. దేని గురించి అడుగుతున్నారు అని ఇందు అంటుంది.
తాతయ్య ఆపరేషన్ కోసం చేసి ఉంటావని ఐశ్వర్య అంటే.. అది నిజమే కానీ, దానికోసం ఇంతలా దిగజారతానా, నా గురించి మీకు తెలియదా నా గురించి అని ఇందు అంటుంది. అయినా రేఖ నమ్మదు. నువ్వు చేసిన ఈ పనికి వాళ్లకు శిక్ష వేస్తాను, ఆ ముసలోడు లేచి నడుస్తాడనే నీ కలను ఇప్పుడే తొక్కేస్తాను అని రేఖ అంటుంది. నెక్లెస్‌ను ఐశ్వర్య తీసిందని తెలిసినా ఆధారం లేకుండా చెప్పలేను అని బాధపడుతుంది స్వాతి .
బయటపడిన ఐశ్వర్య నెక్లెస్ దొంగతనం!
ఒకేసారి ఇద్దరి పంపిస్తే మరింత భయం పుడుతుందని భూషణ్ అంటాడు. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, నిజం చెప్పి నగలు ఇస్తే వాళ్లను కాపాడినదానివి అవుతావ్ అని రేఖ అంటుంది. దాంతో ఇందు కంగారుపడుతుంది. మరోవైపు ఇందు ఇంటర్వ్యూ గురించి చెప్పిన అపర్ణ అన్ని బాగుంటే మన రాజ్ మేనల్లుడుని ఇచ్చి పెళ్లి చేసేవాళ్లం అని చెబుతుంది.
ఇంతలోనే స్వరాజ్ దుగ్గిరాల ఇంటికి లక్కీతో వస్తాడు. అంటే సొంతింటికి స్వరాజ్ వస్తాడు. మరోవైపు పాపం ఇంతమంది రాక్షసుల మధ్యలో పోరాడుతున్న ఇందుకు తోడు దొరుకుతుందని సుభాష్ అంటాడు. దుగ్గిరాల ఇల్లు చూసి రాజ్‍కు గతం ఫ్లాష్‌లా గుర్తుకు వస్తుంటుంది. ఈ ఇంటిని ఇంతకుముందు ఎక్కడో చూశాను అని రాజ్ అంటాడు. నీకు వచ్చే ముష్టి కలలో చూసి ఉంటావ్ అని లక్కీ అంటాడు.
ఆ ముసలోడి నడుం ఇరగ్గొడితే కానీ దీనికి బుద్ధి రాదని భ్రమరాంబ అంటుంది. వాళ్ల జోలికి వెళ్తే ఊరుకోను అని ఇందు అంటుంది. ఇంతలో రాజ్, లక్కీ వస్తారు. స్వరాజ్‌ను చూసి రాజ్ బావల ఉన్నాడని రేఖ నిర్ఘాంతపోతుంది. ఇందును చూసి ఇదేంట్రా ఇక్కడుందనుకుంటారు. రాజ్ అని రేఖ పిలుస్తుంది. నా పేరు భలే గెస్ చేశారే. కానీ, రాజ్ కాదు రాజు, రాజ్ కూడా బాగానే ఉందని రాజ్ అంటాడు.
ఇందు ప్లాన్‌తో రేఖకు చెక్!
అది చూసి రేఖ ఆశ్చర్యపోతుంది. ఈ నెక్లెస్ నీకు ఎక్కడిది అని భ్రమరాంబ అడుగుతుంది. అప్పుడు ఐశ్వర్య కారు ఎక్కింది, కారులో నెక్లెస్ పడిపోయింది, అది ఇద్దామని వచ్చామని లక్కీ అంటాడు. అలా ఐశ్వర్య దొంగతనాన్ని రాజ్ , లక్కీ బయటపెడతారు. అది తీసింది నువ్వా. పాపం ఇందాకటి నుంచి ఇందును అంటే చెప్పవేంటీ అని భ్రమరాంబ నటించేస్తుంది.
మరి ఇంకో నెక్లెస్ ఎక్కడ అని రేఖ కోపంగా అడుగుతుంది. నేను చెబుతాను అని స్వాతి అంటుంది. ఆ ఇంకో నెక్లెస్ స్వాతి తీసుకొచ్చి చూపిస్తుంది. తల్లి భ్రమరాంబ నెక్లెస్ కొట్టేసింది తాను చూసింది గుర్తు చేసుకుంటుంది స్వాతి. అది చూసి భ్రమరాంబ స్పృహ తప్పుతుంది. ఈ నెక్లెస్ నీ రూమ్ ముందే పడిపోయి ఉందని స్వాతి తల్లిని కాపాడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగింది. స్వరాజ్ రాక, ఐశ్వర్య దొంగతనం వెలుగులోకి రావడంతో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


