
📌 Key Points
- కావ్య కథను పుస్తకంగా రాసిన కల్యాణ్, వదినకు అంకితం.
- పుస్తకం చదివి తల్లి గొప్పతనం తెలుసుకున్న ఇందు.
- ఇందూ ఆస్తిని వదులుకోవాలని నిర్ణయం తీసుకుంటుందా?
- కావ్య జీవితం ఇందూకి స్ఫూర్తినిస్తుందా?
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని మలుపు తిరిగింది. కావ్య జీవిత కథ ఆధారంగా ఇందూ తీసుకునే నిర్ణయం సీరియల్‌ను మరో మలుపు తిప్పనుంది. అసలేం జరిగిందో తెలుసా?
కావ్య కథతో ఇందూకి షాక్ ఇచ్చిన అపర్ణ!
Brahmamudi Serial April 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 6వ ఎపిసోడ్‌లో కావ్య కథను పుస్తకంలా రాసి వదినకు అంకితం ఇస్తాడు కల్యాణ్. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న అపర్ణ ఆ బుక్ తీసుకెళ్లి ఇందుకు ఇస్తుంది. ఆ బుక్ చదివిన ఇందు తల్లి గొప్పదనం, ధైర్యం తెలుసుకుంటుంది. కూతురుకు కావ్య ధైర్యం నూరిపోస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో మనకోసం ఇందు ఆస్తిని వదులుకోవాలనుకుంటుంది అని అపర్ణ కంగారుగా చెబుతుంది. ఇందు సేమ్ తన తల్లిలాగే చేస్తుంది. మనం తనను ఒప్పించలేం అని సుభాష్ అంటాడు. మనం ఒప్పించలేం కానీ తన తల్లి ఉందిగా. కావ్య జ్ఞాపకం ఉందిగా అని వెళ్లి ఓ బుక్ తీసుకుని వస్తుంది అపర్ణ .
కావ్య జీవితాన్ని కల్యాణ్ కథలా రాశాడు. ఈ కథను ఇప్పుడు ఇందు తెలుసుకోవాలి ఇందు దగ్గరికి వెళ్తుంది అపర్ణ. తన తల్లి కథను ఇందు తెలుసుకోవాలని బుక్ ఇస్తుంది అపర్ణ. ఇది నీ అమ్మ జీవితం, ఇందులో మీ అమ్మ మనసు, ధైర్యం, ఆవేశం, కన్నీళ్లు, ఆశయం అన్ని ఉన్నాయి. మీ బాబాయ్ మీ అమ్మ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మహాకావ్యంలా రాసి అంకితం ఇచ్చాడు. ఇది చదివి అయిన నీ నిర్ణయాన్ని మార్చుకుంటావని అనుకుంటున్నాను అని బుక్ ఇచ్చి వెళ్లిపోతుంది అపర్ణ.
ఇందూ మనసు మారుతుందా?
అది తీసుకుని మురిసిపోతుంది ఇందు. మరోవైపు నువ్వు ఏదైతే జరగాలని ఆశించావే అదే జరగబోతుంది అమ్మా. కానీ నువ్వు లేవు అని రుద్రాణి ఫొటో చూస్తూ రేఖ అంటుంది. కానీ, నాకు ఆ ఇందు ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. అంతమంది జనాల ముందు ఇందు అడ్డం తిరిగితే చేసేది ఏంటీ, ఇందు సింపుల్‌గా ఎలా ఒప్పుకుందా అనే నా డౌట్ అని భ్రమరాంబ అంటుంది.
మరోవైపు కావ్య జీవితాన్ని చదువుతుంది ఇందు. తన జీవితాన్ని కావ్య చెబుతున్నట్లుగా ఉంటుంది. పుట్టింటి నుంచి అత్తింటి వరకు రావడం, పెళ్లి, అవమానాలు, మౌన పోరాటం కావ్య జీవితం, కావ్యను అంతా ప్రేమించడం, ఆస్తి గొడవలు, కావ్యపై ఆస్తి రాయడం వంటి అన్ని విషయాలు చదువుతుంది ఇందు. నీకు ఇంద్రాదేవి అని పెట్టినందుకు తిట్టుకోవచ్చు. అది మా అమ్మమ్మ పేరు. మా గతానికి గుర్తు మా అమ్మమ్మ మా భవిష్యత్తుకు గుర్తు నువ్వు. రెండు తరాలను కలిపే వారధిగా ఆ పేరు నీకు పెట్టామని కావ్య చెబుతుంది.
రుద్రాణి ప్లాన్స్ బెడిసి కొడతాయా?
రేపే నీ నామకరణం. మీ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితాలు బాగుండాలని శ్రైశైలం వెళ్తున్నాం. నువ్వు పుట్టాక నాకు ఏ బాధలు లేవు. మనసంతా ఆనందంగా ఉంది. నీ వల్లే వచ్చిన ఈ ఆనందం నీకు జీవితాంతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇందు అని కావ్య అంటుంది. దాంతో బుక్ చదవడం అయిపోతుంది. అమ్మా అంటూ ఏడుస్తూ పుస్తకాన్ని హత్తుకుంటుంది ఇందు. అలాగే పడుకుంటుంది.
ఉదయం రేఖ నుంచి తప్పించుకునేందుకు తనను తానే కిడ్నాప్ చేయించుకుంటానని అపర్ణతో చెబుతుంది ఇందు . తనను నువ్వు కిడ్నాప్ చేయాలని స్వాతికి చెబుతుంది ఇందు. దాంతో స్వాతి అలాగే చేస్తుంది. రేఖకు ఆస్తి సొంతం కాకుండా ఉండేందుకు ఇందు, రూ. 10 లక్షల కోసం ఐశ్వర్య, రాజు ముగ్గురు ఇందు కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇందూ తన తల్లి అడుగుజాడల్లో నడుస్తుందా? లేదా ఆస్తి విషయంలో వెనక్కి తగ్గుతుందా? వేచి చూడండి! మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


