
📌 Key Points
- రాజ్, లక్కీ కిడ్నాప్ స్కెచ్.. ఇందు ఫుల్ కోపరేషన్!
- ఐశ్వర్య 20 లక్షలు అడుగుదామని.. రాజ్ కోటి ప్లాన్
- స్మోక్ మెషిన్ తో కిడ్నాప్.. స్పృహ కోల్పోయిన అందరూ!
- ఇందును ప్రశ్నించిన లక్కీ.. నిజం బయటపడుతుందా?
బ్రహ్మముడి సీరియల్‌లో ఒక సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది! రాజ్ వేసిన ప్లాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!
ఇందు కిడ్నాప్ వెనుక రాజ్ మాస్టర్ ప్లాన్!
Brahmamudi Serial April 11th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 11వ ఎపిసోడ్‌లో స్మోక్ మేషిన్ పెట్టి ఇందును కిడ్నాప్ చేస్తారు రాజ్, లక్కీ. వాళ్లకు ఇందు బాగా కోపరేట్ చేస్తుంది. రాజ్‌కు కాల్ చేసిన ఐశ్వర్య రేఖ ఆంటీని రూ. 20 లక్షలు అడుగుదామని చెబుతుంది. కాదు కోటి రూపాయలు అడుగుదామని రాజ్ చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కేక్ కటింగ్ తర్వాత రాజ్ వచ్చి కేక్ తీసుకెళ్తాడు. మీరు నా ప్లాన్‌ను ఫెయిల్ చేస్తున్నారని స్టేజీపైన రాజుతో అంటుంది ఐశ్వర్య. ఇందు సంతకం పెట్టదు అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్. ఇందు టెన్షన్ పడుతూ తను అరెంజ్ చేసిన కిడ్నాపర్స్ వైపు చూస్తుంది.
అప్పటివరకు పనిచేయని స్మోక్ మెషిన్ పనిచేస్తుంది. దాంతో అందరివైపు స్మోక్ పంపిస్తాడు రాజ్, లక్కీ. దాంతో ఇందు పురమాయించిన కిడ్నాపర్స్‌తో సహా అంతా స్పృహ తప్పుతారు. ఐశ్వర్య మాత్రం స్మోక్‌కు దూరంగా ఉంటుంది. ఇందు చేయి పట్టుకుని రాజ్ తీసుకెళ్లిపోతాడు. బయట వాళ్లను ఆగమని వెళ్లి లగేజ్ తెచ్చుకుంటుంది. మనకు కోపరేట్ చేస్తుందేంటీ మావ అని లక్కీ డౌట్ పడతాడు. స్మోక్ దెబ్బకు బ్రెయిన్ పనిచేయట్లేదనుకుంటా అని రాజ్ అంటాడు.
అందరూ వచ్చేస్తారు త్వరగా రమ్మని ఇందు అనడంతో రాజ్, లక్కీ కారు ఎక్కుతారు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి అడ్వెంచర్ చేయడం, ఈరోజు నాకు స్వేచ్ఛ దొరికినట్లు ఉందని ఇందు అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని లక్కీ అడిగితే.. తెలుసు కిడ్నాపే కదా. చూడటానికి ఎధవల్లా ఉన్నారు, కానీ బాగా కిడ్నాప్ చేశారని మెచ్చుకుంటుంది ఇందు. దాంతో కర్చీఫ్‌పై మత్తు స్ప్రే చల్లి ఇందుకు పెడతాడు రాజ్.
ఐశ్వర్య కుట్ర.. రేఖకు షాక్ తప్పదా?
ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. బబ్లూ వాళ్లు కనిపించట్లేదు అంటే ఇందు అక్క కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట అని స్వాతి అనుకుంటుంది. ఐశ్వర్య వచ్చి ఇందును ఎవరో ఇద్దరు కిడ్నాప్ చేశారని చెబుతుంది. అమ్మో ఆస్తి గల్లంతు అయిపోయింది, నోటి కాడి కూడు లాక్కున్నాడు వాడెవడో అని భ్రమరాంబ గోల పెడుతుంది. ఈ విషయం బయటకు రాకముందే దీన్ని హ్యాండిల్ చేయాలని, పోలీసులకు ఫోన్ చేయమని భూషణ్‌కు రేఖ చెబుతుంది.
ఇందును కుర్చీకి తాళ్లతో కట్టేస్తారు రాజ్, లక్కీ. తర్వాత ఇద్దరు నవ్వుకుంటారు. అసలైన రిస్క్ ఇక్కడే మొదలైంది. ఈ మహాతల్లి మనల్ని చూడనంతవరకే చూసిందా మన పని అయినట్లే, జాగ్రత్తగా ఉండు అని రాజ్, లక్కీ ఒకరికొకరు చెప్పుకుంటారు. నీకు అయితే చుక్కలు చూపిస్తుందిరా అని రాజ్‌ని అంటూ నవ్వుతాడు లక్కీ. నేను ఎవరో తెలిసినప్పుడు కదా. తెలిసేలోపు పని ముగిద్దామని రాజ్ అంటాడు.
దాంతో ఐశ్వర్య, లక్కీ ఇద్దరు షాక్ అవుతారు. రాజ్, ఐశ్వర్య వాటాల గురించి బేరాలు మాట్లాడుకుంటారు. ఇద్దరు 50-50 అనుకుంటారు. మా ఆంటీ ఇందుకోసం కాకపోయినా సంతకం కోసం అయిన ఎలాగైనా పట్టుకొస్తుందని ఐశ్వర్య అంటుంది. మరి ఎక్కడ దాచిపెట్టారని ఐశ్వర్య అడిగితే.. అది తెలియకపోవడమే మంచిది అని కాల్ కట్ చేస్తాడు రాజ్.
లక్కీ డౌట్.. అసలు నిజం తెలుస్తుందా?
ఇంటి ఓనర్ గురించి రాజ్ అడిగితే కేవలం వింటర్‌లోనే వస్తాడని, వేసవిలో ఫారెన్‌లో గడుపుతాడని లక్కీ చెబుతాడు. మరోవైపు ఇందు కిడ్నాప్‌పై పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మాటల మధ్యలో శేషు సంతకం పెట్టలేదని బాధపడుతున్నావా అని భ్రమరాంబను అంటాడు. సంతకం ఏంటీ అని పోలీస్ అడుగుతాడు.
అమ్మో కరెక్ట్ పాయింట్‌కు వచ్చేశాడు. నేనే కిడ్నాప్ చేయించానని తెలిసిపోతుందా ఏంటీ అని ఐశ్వర్య లో వణుకు మొదలవుతుంది. మరోవైపు ఇందుకు లక్కీ నీళ్లు తాగిస్తుంటాడు. ఇంతలో మాస్క్ తీసి లక్కీని చూస్తుంది ఇందు. ఒరేయ్ లక్కీ నువ్వా అని తిడుతుంది. మేము కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశామని రాజ్ చెబుతాడు.
డబ్బుల కోసం నన్ను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉందని ఇందు అనుమానిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ కథనం చాలా ఆసక్తికరంగా మారింది. రానున్న ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


