|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ ఫైర్: అట్లీకి సీరియస్ వార్నింగ్! ఇక అంతేనా?

Published: 13-02-2026, 11:35 PM
అల్లు అర్జున్ ఫైర్: అట్లీకి సీరియస్ వార్నింగ్! ఇక అంతేనా?
  • అల్లు అర్జున్, అట్లీ సినిమాకు 800 కోట్ల భారీ బడ్జెట్!
  • షూటింగ్ ఆలస్యం కావడంతో బన్నీ సీరియస్ అయ్యాడు
  • సినిమా మేకింగ్ పక్కాగా ఉండాలని అల్లు అర్జున్ ఆదేశం
  • 2027లో అల్లు అర్జున్-అట్లీ సినిమా విడుదల కానుంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. బన్నీ మేకర్స్‌పై సీరియస్ అయ్యాడట! అసలేం జరిగిందో తెలుసా?

అల్లు అర్జున్ అసహనం: షూటింగ్ ఆలస్యం!

(Allu Arjun): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. భారీ గ్రాఫిక్స్ తో, విజువల్ వండర్ గా ఈ సినిమాను చెక్కుతున్నారు దర్శకుడు అట్లీ. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

అంతేకాదు, ఈ సినిమా విడుదల తరువాత ఇండియన్ సినిమా మేకింగ్ సరికొత్త పుంతలు తొక్కుతుందని, మరిన్ని లార్జ్ స్కేల్ సినిమా చేయడానికి ఈ సినిమా ఫౌండేషన్ అవుతుంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కానీ, తాజాగా ఈ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ సినిమా మేకింగ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్((Allu Arjun)) చాలా డిజప్పాయింట్ గా ఉన్నాడట.

మేకర్స్‌కు బన్నీ క్లాస్: ప్లాన్ మార్చండి!

కారణం ఏంటంటే, అనుకున్నదానికంటే ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతోదట. ఇలా అయితే అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ కష్టం అవుతుందని భావిస్తున్నాడట అల్లు అర్జున్. ఈ విషయంలో మేకర్స్ పై సీరియస్ అయ్యాడట బన్నీ. అంతేకాదు, మేకింగ్ అంతా పక్కా ప్లాన్ చేసుకొని షూటింగ్ త్వరగా ఫినిష్ చేయాల్సిందిగా క్లాస్ కూడా పీకాడట. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిందట.

2027 విడుదల: సాధ్యమేనా?

ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ తెరకెక్కనుందని టాక్. మరి ఈ రెండు సినిమాల తరువాత అల్లు అర్జున్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది ఊహకు కూడా అందడం లేదు. ఇక అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తున్న సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ సినిమా విడుదల గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.