|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ప్రోమో: అప్పుకు నిజాలన్నీ చెప్పేసిన రౌడీ- పెళ్లి రోజే యామిని అరెస్ట్- యామిని ఫ్యామిలీ సూసైడ్!

Published: 07-06-2025, 9:10 PM
బ్రహ్మముడి ప్రోమో: అప్పుకు నిజాలన్నీ చెప్పేసిన రౌడీ- పెళ్లి రోజే యామిని అరెస్ట్- యామిని ఫ్యామిలీ సూసైడ్!

బ్రహ్మముడి సీరియల్‌లోని తాజా ప్రోమోలో అనూహ్య ట్విస్టులు కనిపిస్తున్నాయి. అప్పు రౌడీల గురించి కీలకమైన సమాచారం బయటపెడుతుండగా, యామిని పెళ్లి రోజున ఎదుర్కొనే సంక్షోభం ఆందోళన కలిగిస్తుంది. యామిని కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నిస్తుందా?

Key Points

1

రౌడీల గురించి అప్పు నిజాలు బయటపెడుతుంది.

2

యామిని పెళ్లి రోజున అరెస్ట్ అవుతుందా?

4

రాజ్ మరియు యామిని పెళ్లి జరుగుతుందా లేదా?

అప్పు ఆవిష్కరించే నిజాలు

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కావ్య చెప్పినదాన్ని బట్టి చూస్తే ఏదో తేడా కొడుతుంది అని ప్రకాశం అనుమానిస్తాడు. ఆ రౌడీలు ఎవరు, టీ షాప్ దగ్గర అయిన గొడవకే అడవిలో రాత్రంతా కావ్య, రాజ్ కోసం వెతకటం ఏంటీ అని సుభాష్ అంటాడు. అదంతా నేను కనుక్కుంటాను అని అప్పు చెబుతుంది.

అప్పు చేతికి దొరికితే అప్పడం అయిపోతుందని స్వప్న అంటుంది. రేపు యామిని ఇచ్చే సర్‌ప్రైజ్‌కు అంతా ఏడుస్తు ఉండాల్సి వస్తుందని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. మరోవైపు యామిని ఇంటికి రాజ్ వెళ్తాడు. రామ్ వచ్చాడని యామినికి తల్లి వైదేహి చెబుతుంది. అయితే, ఇల్లంతా పూల దండలతో డెకరేషన్ చేసి ఉండటంతో రాజ్ ఆశ్చర్యపోతాడు.

అసలు ఏంటీ ఇదంతా, దేనికి ఇదంతా. ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయా అని రాజ్ అడుగుతాడు. బర్త్ డే కాదు బ్యాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయని యామిని తండ్రి అంటాడు. అర్థం కాలేదని రాజ్ అంటే.. ఏంటీ రామ్ అప్పుడే మర్చిపోయారా. ఎల్లుండే కదా మీ పెళ్లి అని వైదేహి చెబుతుంది. దాంతో రాజ్ తెగ షాక్ అయి పోతాడు. ఇంతలో యామిని వస్తుంది.

యామిని పెళ్ళి రోజు సంక్షోభం

ఎల్లుండే మన పెళ్లి బావ, రెండు రోజుల్లో మనం భార్యాభర్తలం అయిపోతాం అని యామిని సంతోషంగా చెబుతుంది. దాంతో రాజ్ డల్‌ అయిపోతాడు. అది చూసిన యామిని ఏమైంది బావ, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా. రిసార్టులో కూడా నన్ను వదిలేసి ఫ్రెండ్ అని చెప్పి వెళ్లిపోయావ్. ఇంతకీ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని యామిని నిలదీస్తుంది.

ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని రాజ్ తెగేసి చెబుతాడు. దాంతో యామినితోపాటు తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అవుతారు. అలా అంటావేంటీ రామ్, ఇంకెప్పుడు ఇష్టం ఉంటుంది. నువ్వే తన వెంట పడి ప్రేమించేలా చేశావ్. నీకోసమే యామిని బతుకుతుంది. నువ్ గతం మర్చిపోయాక ఎంత తల్లడిల్లిందో. నీమీదే ఆశలు పెట్టుకుని జీవిస్తుంది అని వైదేహి అంటుంది.

దాంతో నాకు కళావతి గారు అంటే చాలా ఇష్టం, ఆమె నా ప్రేమను ఒప్పుకున్నాక మీకు చెబుదామనుకున్నాను. కానీ అని రాజ్ అంటాడు. ఇకపై నువ్ నా లైఫ్‌లో ఉండవని తెలిసాకా ఇంకా నాకు ఈ లైఫ్ ఎందుకు అని యామిని అంటుంది. అలా అని పక్కనే ఉన్న కత్తి తీసుకుని పొడుచుకోబోతుంది. కానీ, రాజ్ ఆపుతాడు. అసలు ఏం చేస్తున్నావ్. బుర్ర అస్సలు పనిచేయట్లేదా అని రాజ్ అంటాడు.

ఆత్మహత్య ప్రయత్నం?

ఇలా బాధపడుతూ, మనందరిని బాధపెడుతూ రోజు చచ్చేకన్నా ఒకేసారి చచ్చిపోవడం మంచిది కదా బాబు అని వైదేహి అంటుంది. నా కూతురు మెడలో తాళి కడతావా. దాని మెడకు ఉరితాడుగా మారుతావా చెప్పు అని యామిని తండ్రి నిలదీస్తాడు. అలా రామ్ మరదలు యామిని ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునేందుకు సిద్ధపడతారు. దాంతో ఏం చెప్పలేక పెళ్లికి ఒప్పుకుంటాడు రాజ్.

ఇక మరోవైపు యామిని పురామయించిన రౌడీలను పోలీస్ స్టేషన్‌లో ఇంట్రాగేషన్ చేస్తుంది. పోలీసులు టార్చర్ పెట్టడంతో రౌడీ నిజం చెబుతాడు. రాజ్, కావ్యకు యాక్సిడెంట్ నుంచి కళావతిని రిసార్ట్ దగ్గర చంపేయమని చెప్పడం వరకు అంతా యామిని ప్లానే అని రౌడీ అప్పుకు నిజాలు చెప్పేస్తాడని ఊహించవచ్చు. దాంతో యామిని ని అప్పు అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్తుంది.

యామినితో రాజ్ పెళ్లి జరుగుతుంటుంది. యామిని పెళ్లి రోజునే అప్పు పోలీసులతో వెళ్లి అరెస్ట్ చేస్తుందని తెలుస్తోంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌లోని ఈ ఉత్కంఠభరితమైన ట్విస్టులు ప్రేక్షకులను అంచున కూర్చోబెడతాయి. యామిని మరియు రాజ్ జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.