|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Brahmanandam: బ్రహ్మానందంకు జీవితకాల పురస్కారం..జీవిత వ్యర్థం అంటూ!

Published: 08-12-2025, 1:48 AM
Brahmanandam: బ్రహ్మానందంకు జీవితకాల పురస్కారం..జీవిత వ్యర్థం అంటూ!
  • బ్రహ్మానందంకు బొల్లి ముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారం లభించింది.
  • ఆనందం లేని జీవితం వ్యర్థమని, ఇతరులకు ఆనందం పంచడమే లక్ష్యమని బ్రహ్మానందం అన్నారు.
  • తెనాలిలో తన వివాహం జరిగిందని, ఆ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
  • వయసు పైబడటంతో సినిమాలు తగ్గించి, కథా ప్రాధాన్యత ఉన్నవాటిలో మాత్రమే నటిస్తున్నారు.

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తాజాగా బొల్లి ముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబ్బు కన్నా ఆనందమే ముఖ్యమని, ఇతరులకు సంతోషం పంచడమే తన జీవిత లక్ష్యమని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జీవితకాల పురస్కారం, బ్రహ్మానందం వ్యాఖ్యలు

Brahmanandam: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ అంటే అందరికీ టక్కున సీనియర్ నటుడు బ్రహ్మానందం(Brahmanandam) గుర్తుకు వస్తారు. తన అద్భుతమైన కామెడీ ద్వారా తెలుగు ప్రేక్షకులను కడుపుగా నవ్వించిన ఘనత బ్రహ్మానందం గారికి ఉండేది . సుమారు వెయ్యికి పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం సినీ ప్రయాణంలో ఎన్నో గౌరవాలను పురస్కారాలను సొంతం చేసుకున్నారు. తాజాగా బ్రహ్మానందం మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈయనకు మరో జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బొల్లి ముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ పురస్కారాన్ని బొల్లి ముంత శివరామకృష్ణ ఫౌండేషన్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సంయుక్తంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దేవుడు తనకు ఎన్ని జన్మలిచ్చినా అన్ని జన్మలు తాను ఇతరులకు ఇలా ఆనందాన్ని పంచే జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటానని తెలిపారు. అలాగే ఒక మనిషి జీవితంలో డబ్బు ఎంత ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమని తెలియజేశారు. అందరికీ ఆనందాన్ని పంచే సత్తా అందరి ముఖాలలో నవ్వులను పూజించే నైపుణ్యం దేవుడు తనకు ఇచ్చాడని జీవితంలో తనకు ఇంతకంటే కావాల్సింది ఏముందని ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలిపారు.

తెనాలి జ్ఞాపకాలు, అనుబంధం

ఇక తెనాలితో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా తెనాలి వైకుంఠపురంలోని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిసెంబర్ 14వ తేదీ తన వివాహం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.. ఇక బ్రహ్మానందం ఈ విధమైనటువంటి పురస్కారాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బ్రహ్మానందం ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. ఈయన వయసు పైబడిన నేపథ్యంలో సినిమాలను కూడా కాస్త తగ్గించారు. కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒకానొక సమయంలో థియేటర్లో ఒక సినిమా విడుదల అయ్యింది అంటే కచ్చితంగా ఆ సినిమాలో బ్రహ్మానందం ఉండేవారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న బ్రహ్మానందం నంది పురస్కారాలను ఫిలింఫేర్, పద్మశ్రీ, అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే ఈయన అత్యధిక సినిమాలలో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే.

సినిమాల తగ్గింపు, అభిమానుల స్పందన

బ్రహ్మానందంకు జీవితకాల పురస్కారం లభించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా నవ్వించిన ఆయన, ప్రస్తుతం తగ్గించిన సినిమాలతోనూ ఆకట్టుకుంటున్నారు. ఇది ఆయన సినీ ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.