|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీకి అనసూయ సంచలన కౌంటర్: “మగజాతికి దమ్ముంటే అలా చెప్పండి!”

Published: 24-12-2025, 11:08 AM
శివాజీకి అనసూయ సంచలన కౌంటర్: "మగజాతికి దమ్ముంటే అలా చెప్పండి!"
  • హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
  • శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ తన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
  • అనసూయపై శివాజీ ‘విశాల హృదయానికి థ్యాంక్స్’ అంటూ సెటైర్లు వేశారు.
  • “అడవి జంతువుల్లా పడకుండా మగవారికి చెప్పండి” అంటూ అనసూయ శివాజీకి రీకౌంటర్ ఇచ్చారు.

హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వివాదంలో అనసూయ, శివాజీ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. తాజాగా శివాజీ సెటైర్లకు దీటైన సమాధానం ఇస్తూ, “మగజాతికి దమ్ముంటే ఇలా చేయండి” అంటూ అనసూయ స్ట్రాంగ్ రీకౌంటర్ ఇచ్చింది.

శివాజీ వ్యాఖ్యలు – దుమారం రేపిన వివాదం

Anasuya Vs Shivaji: శివాజీ వివాదం కాస్తా ఇప్పుడు అనసూయ మీదకు మళ్లీంది . శివాజీ వర్సెస్ ‌ అనసూయ అన్నట్టుగా మారింది . ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు . ఇటీవల దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ‌ లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ ‌ పై చేసిన కామెంట్స్ ‌ ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే . ఇండస్ట్రీ అంత ఏకమై శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది . నెటిజన్స్ ‌, పలువురు సోషల్ ‌ యాక్టివిక్ట్స్ ‌ కూడా శివాజీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ‌ చేశారు . తనకు వస్తున్న వ్యతిరేకతతో శివాజీ వెనక్కి తగ్గి ఆడవాళ్లకు , హీరోయిన్లకు క్షమాపణలు చెప్పారు .

అలాగే తాజాగా దండోరా ప్రెస్ ‌ మీట్ ‌ లో ఆయన మాట్లాడుతూ .. తనవల్ల తప్పు జరిగిందని అంగీకరించారు . తను వాడిన రెండు పదాలు తప్పే కానీ , తన స్టేట్ ‌ మెంట్ ‌ కే కట్టుబడి ఉంటాననన్నారు . శివాజీ కామెంట్స్ ‌ అనసూయ ఆయన అమ్మాయిల డ్రెస్సింగ్ ‌ పట్ల శివాజీ ఇన్ ‌ సెక్యూరిటీగా ఉన్నారని , ఆయన మైండ్ ‌ సెట్ ‌ కి తనకి జాలేస్తుందన్న సంగతి తెలిసిందే . ఆమె కామెంట్స్ ‌ పై కూడా ఈ సందర్భంగా శివాజీ స్పందించాడు . అనసూయ తనపై జాలి చూపించిందని , ఆమె విశాల హ్రదయానికి థ్యాంక్స్ ‌ అంటూ సెటైర్లు వేశారు . అంతేకాదు త్వరలోనే ఆమె రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడి ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ అనసూయకు స్ట్రాంగ్ ‌ కౌంటర్ ‌ ఇచ్చాడు .

అనసూయపై శివాజీ సెటైర్లు: ఆపై ఆమె కౌంటర్

ఇప్పుడు శివాజీ కామెంట్స్ ‌ పై అనసూయ రియాక్ట్ ‌ అయ్యింది . ఈ మేరకు ఇన్ ‌ స్టాగ్రామ్ ‌ లో వీడియో షేర్ ‌ చేసింది . అతివినయం ధూర్త లక్షణం మొదట్లోనే శివాజీకి రీకౌంటర్ ‌ ఇచ్చింది . మనసులో ఏముందో బయటకు చెప్పేవాలతో ఎలాంటి సమస్య లేదు .. అమ్మ నాన్న అంటూ ముద్దుముద్దుగా మాట్లాడేవాళ్ల చాలా డేంజర్ ‌. తప్పు అయ్యిందంటూ మీడియా ముందుకు వచ్చి విక్టిమ్ ‌ కార్డు ప్లే చేస్తున్నారు . నిజంగా హీరోయిన్ల రక్షణ కోసం ఆలోచించేవారు అయితే .. అసలు ఇలా మాట్లాడేవారు కాదు . ఒకవేళ మీరు నిజంగా హీరోయిన్ల సెఫ్టీ గురించి ఆలోచిస్తే .. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మగజాతికి ఇలా చెప్పండి . అడవి జంతువుల్లా ఆ అమ్మాయి మీద పడటం ఏంట్రా .. ఆ అమ్మాయి అంత అందంగా ఉంది ప్రశంసించాడు . ఆమె బౌండరీని గౌరవించండని చెప్పండి అంటూ అనసూయ చెప్పుకొచ్చింది . అలాగే అసలు ఆడవాళ్లు బట్టలు ఇలా వేసుకోవాలి .. అలా వేసుకోవాలని ఎక్కడ ఉందని ప్రశ్నించింది .

“మగజాతికి దమ్ముంటే అలా చెప్పండి!” – అనసూయ సవాల్

సెల్ఫ్ ‌ కంట్రోల్ ‌ లేనివాళ్లే ఆడవాళ్ల బట్టలపై మాట్లాడుతుంటారు . సెల్ఫీ కంట్రోల్ ‌ లేని వాళ్లే ఇతరులను కంట్రోల్ ‌ చేయాలని చూస్తున్నారు . ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే నాకు జాలేస్తుందంటూ గట్ట కౌంటర్ ‌ ఇచ్చింది . అలాగే నా రుణం తీర్చుకుంటా అనే వ్యాఖ్యలపై స్పందించింది. ‘ నేను జాలి అనలేదు సర్ .. సింపతైజ్ ‌ అన్నాను .. జాలికి .. సింపతికి చాలా డిఫరెంట్ ‌ ఉంది . కానీ , నిజంగా మీ మీద నేను జాలి పడుతున్నారు . మీరు తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నా అంది . అలాగే నా రుణం తీర్చుకునే అవకాశం రావాలన్నారు . నేను ఆచలా సందర్భాల్లో చాలా ఇబ్బందులను దాటుకుని వచ్చాను .. నా సమస్యను నేను తీర్చుకుని ఎదుర్కొనే అంత శక్తి నాకు ఉంది . నాకు మీ సపోర్టు అస్సలు అక్కర్లేదు .. ప్లీజ్ ‌ నాకు దూరంగా ఉండండి ‘

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

శివాజీ వ్యాఖ్యలు, అనసూయ రీకౌంటర్‌తో వివాదం మరింత ముదిరింది. మహిళల దుస్తులపై కాకుండా, పురుషుల ఆలోచన మారాలన్న అనసూయ సవాల్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.