|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్! కల్యాణ్ కిడ్నాప్, ధాన్యలక్ష్మి సంచలన ఆరోపణలు!!

Published: 12-02-2026, 10:35 PM
షాకింగ్: బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్! కల్యాణ్ కిడ్నాప్, ధాన్యలక్ష్మి సంచలన ఆరోపణలు!!
  • కల్యాణ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు!
  • రాజ్‌పై ధాన్యలక్ష్మి సంచలన ఆరోపణలు!
  • ఆస్తి కోసమే కిడ్నాప్ డ్రామా?
  • రుద్రాణి ప్లాన్‌తో కొత్త ట్విస్ట్!

బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కల్యాణ్ కిడ్నాప్ అవ్వడం, ధాన్యలక్ష్మి రాజ్ మీద నిందలు వేయడంతో సీరియల్ మరింత ఉత్కంఠగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే!

కల్యాణ్ కిడ్నాప్ వెనుక ఎవరు?

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 13 ఎపిసోడ్‌లో మంత్రితో మనం మాట్లాడింది రుద్రాణి విన్నదని కల్యాణ్‌తో చెప్పిన అప్పు సీక్రెట్‌గా ఇన్వెస్టిగేట్ చేయమని, టాస్క్ ఫోర్స్ వాళ్ల హెల్ప్ తీసుకోమని పోలీస్‌కు చెబుతుంది అప్పు. ఇంటి సగం ఆస్తిని కల్యాణ్‌పై రాసినట్లు రాజ్ చెబుతాడు. కానీ, అప్పు, కల్యాణ్ కిడ్నాప్ అవుతారు.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నా కొడుకు భవిష్యత్తుకు సమస్య రాకూడదంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదు. ఆస్తి నుంచి చిల్లి గవ్వ బయటకు పోకూడదు అని రచ్చ చేస్తుంది ధాన్యలక్ష్మీ . రాజ్, కావ్య నచ్చ జెప్పాలని వినిపించుకోదు ధాన్యలక్ష్మీ.

ఆస్తులు పంచరు కానీ తేరగా దానం చేస్తానంటే ఎలా అని నోరు జారుతుంది ధాన్యలక్ష్మీ. ఆస్తిని పంచుతారో లేదా ట్రస్ట్‌ను ఆపుతారో తేల్చుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత సీతారామయ్య బాధగా ఉంటాడు. ఇందిరాదేవితో ధాన్యలక్ష్మీ గురించి మాట్లాడుకుంటారు.

నేను ఇదివరకు ట్రస్ట్ పెట్టాలనుకున్నాను. కానీ, బతుకు పోరాటంలో పెట్టలేకపోయాను. నా మనవడి వల్ల నా ఆశయం నెరవేరుతుందనుకున్నా. కానీ, అయిన వాళ్లే అడ్డు పడతారనుకోలేదు అని సీతారామయ్య అంటాడు. రాజ్ ఎలాగైనా నీ కల నెరవేర్చుతాడు, ధాన్యలక్ష్మీని ఎలాగైనా ఒప్పుస్తాడు అని ఇందిరాదేవి అంటుంది.

ధాన్యలక్ష్మి ఆరోపణలు నిజమేనా?

ఇంతలో ధాన్యలక్ష్మీ వస్తే కల్యాణ్ రివర్స్ అవుతు ఫైర్ అవుతాడు. ట్రస్ట్ అంటే నమ్మకం అమ్మా. అది స్వార్థం కాదు. అన్నయ్య, వదిన చేసేది మన కోసమే. మనం పోయినా మన గురించి పది మంది గుర్తుంచుకోడానికే అని కల్యాణ్ అంటాడు. దీనికి డబ్బు పిచ్చి పట్టిందని ప్రకాశం అంటాడు. భవిష్యత్ కోరుకోవడం తప్పు కాదు మంచి పనికి అడ్డు చెప్పడం తప్పు అని కల్యాణ్ అంటాడు.

కావాలంటే రాజ్ వాళ్ల ఆస్తిని ఇచ్చుకోమనండి అని ధాన్యం అంటుంది. అసలు మన భాగం ఎక్కడిదమ్మా. తాతయ్య సంపాదించాడు కాబట్టి మన ఆస్తి అంటున్నాం. కానీ, పెరిగిన ఆస్తిలో మన శ్రమ ఏమైనా ఉందా. నేను ఏమైనా సంపాదించానా. అన్నయ్య మాత్రం రాత్రి పగలు కష్టపడ్డారు అని ధాన్యంపై కోప్పడుతాడు కల్యాణ్. నేను వాస్తవం మాట్లాడుతున్నాను అని తన మాట మీద నిలబడుతుంది ధాన్యం.

మరి మన పరిస్థితి అని రాజ్ అంటాడు. మనకు వ్యాపారం ఉంది. టాలెంట్‌తో సంపాదించుకుందామని. ఎన్ని అడ్డంకులు వచ్చిన ట్రస్ట్ ఆగకూడదు అని కావ్య అంటుంది. డబ్బు కోసం గొడవ పడే ఆడవాళ్లు ఉన్నారు. కానీ నువ్వు చాలా గొప్పదానివి అని కావ్యను మెచ్చుకుంటాడు రాజ్.

రుద్రాణి ప్లాన్ ఫలిస్తుందా?

మరోవైపు శంకర్‌కు కాల్ చేసిన అప్పు హాస్పిటల్‌లో కావ్య పాపపై అటాక్ జరిగింది తెలుసుకోమని, అది మంత్రి గారు కాదు వేరే వాళ్లు చేయించారని నా డౌట్, ఆ మనిషి ఎవరో నేను తెలుసుకోవాలి, సీసీ కెమెరాలో రౌడీలను గుర్తించి పట్టుకోవాలి, వాళ్ల ద్వారా అది చేయించిన వాళ్లను తెలుసుకోవాలి, అఫిషియల్‌గా కాకుండా టాస్క్ ఫోర్స్ వాళ్లతో సీక్రెట్‌గా చేయించండి అని అప్పు చెబుతుంది.

ఒకవేళ మినిస్టర్‌కు బిడ్డలను మార్చే ఐడియా రుద్రాణి ఇచ్చే ఉంటుంది. మన ఇంట్లో మనిషే మన శత్రువు అయితే ఏం జరుగుతుందో ఊహించలేం. నేను ఎక్కడికి వెళ్లట్లేదు. ఇంట్లో నుంచే చేస్తున్నా అని అప్పు అంటుంది. మరుసటి రోజు ఉదయం కల్యాణ్ పేరు మీద సగం ఆస్తి రాశామని రాజ్ చెబుతాడు.

కానీ, కల్యాణ్, అప్పు కిడ్నాప్ అయ్యారు. ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందనే రాజ్ కిడ్నాప్ చేయించాడు అని నిందలు వేస్తుంది ధాన్యలక్ష్మీ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. రానున్న ఎపిసోడ్స్‌లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.