|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మాండం: ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ‘బ్రహ్మాండ’ సినిమా.. ఏమైనాదే పిల్ల సాంగ్ రిలీజ్..

Published: 04-08-2025, 9:19 AM
బ్రహ్మాండం: ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ‘బ్రహ్మాండ’ సినిమా.. ఏమైనాదే పిల్ల సాంగ్ రిలీజ్..

ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాండ’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ‘ఏమైనాదే పిల్ల’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది.

Key Points

1

ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'బ్రహ్మాండం'

2

సినిమాలో ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు

4

ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది

‘బ్రహ్మాండం’ సినిమా విశేషాలు

Bramhanda : ఒగ్గు కళాకారుల నేపథ్యంలో, వారి సాంస్కృతి సాంప్రదాయాలపై తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాండ’. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో మమత ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాసరి సురేష్ నిర్మాణంలో రాంబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది కూడా తెలంగాణ నేపథ్యంలో సాగే భావోద్వేగ భరితమైన సినిమా.

బ్రహ్మాండ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని ఈ సినిమా హీరో బన్నీరాజు తెలిపారు. ఇటీవల బ్రహ్మాండ సినిమా నుండి ఏమైనాదే పిల్ల.. అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాటను వరికుప్పల యాదగిరి రాసి సంగీతం అందించగా యాదగిరి, శ్రీయ మాధురి పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

‘ఏమైనాదే పిల్ల’ లిరికల్ సాంగ్ విడుదల

నటీనటుల వివరాలు

ఇక ఈ సినిమాలో ఆమని తో పాటు జయరాం, కొమరం బన్నీ రాజ్, జోగిని శ్యామల, విజయ రంగరాజు, కనిక వాద్య, ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, చత్రపతి శేఖర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

బ్రహ్మాండం సినిమా ఆగస్టు 22న విడుదల కానున్నందున, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. లిరికల్ సాంగ్ ప్రజాదరణ పొందినట్లు తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.