
📌 Key Points
- పెళ్లిలో వధువు రసగుల్లా తినడానికి నిరాకరించడంతో వరుడు ఆగ్రహం.
- కోపంతో రసగుల్లాను నేలకేసి కొట్టిన వరుడు.
- వరుడు ప్రవర్తనపై నెటిజన్ల విమర్శలు, విడాకుల గురించి చర్చలు.
- వధువు తిని ఉంటే సరిపోయేదని కొందరి అభిప్రాయం.
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. వధువు రసగుల్లా తినడానికి నిరాకరించడంతో వరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ సంఘటన పెళ్లి వేడుకలో కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
రసగుల్లా తిరస్కరణతో వివాదం
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయం కరంగా కూడా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలు అయితే, చాలా వింతగా కూడా ఉంటాయి. అయితే లేటెస్ట్ గా పెళ్లిలో వరుడు, వధువు మధ్య జరిగిన సంఘటన వైరల్ గా మారింది. ప్రస్తుతం పెళ్లిల్లో సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని నలుమూలల పెళ్లిళ్లు లక్షల్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెళ్లిలో కొత్త జంట మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన వైరల్ గా మారింది. సాధారణంగా పెళ్లిలలో వరుడు, వధువు ఇద్దరూ స్వీట్లు తినిపించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అది ఆచారంగా వస్తోంది.
అయితే ఈ నేపథ్యంలోనే వీడియోలో కనిపించిన జంట కూడా రసగుల్లా తినిపించుకునే ప్రయత్నం చేసింది. మొదట వరుడికి వధువు రసగుల్లా తినిపించింది. దానిని నోట్లో వేసుకున్న వరుడు, వెంటనే వధువుకు కూడా తినిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పెళ్లికూతురు రసగుల్లా తినకుండా నిరాకరించింది. దీంతో వెంటనే ఆగ్రహానికి వచ్చాడు వరుడు. చేసేదేమీ లేక ఆమెకు పెట్టాల్సిన రసగుల్లా, నోట్లోది కూడా నేలకేసి కొట్టాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు. పెళ్లిలోనే ఇలా గొడవ పడుతున్న ఈ జంట, అతి త్వరలోనే విడాకులు తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. వరుడు స్వీట్ తినిపించినప్పుడు, వధువు తింటే సరిపోయేది కదా ? తప్పంతా పెళ్ళికూతురుదే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
వరుడి ఆగ్రహం, రసగుల్లాను నేలకేసి కొట్టడం
నెటిజన్ల స్పందనలు, విడాకుల గురించి చర్చ
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పెళ్లిళ్లలో ఆచారాల గురించి, సంబంధాలలో సర్దుకుపోవడం గురించి చర్చకు దారితీసింది. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు కారణం అవుతాయని తెలుస్తుంది.


