
📌 Key Points
- BSNL ఫాదర్స్ డే సందర్భంగా కొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది.
- రూ. 997, రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌లపై బోనస్ డేటా లభిస్తుంది.
- ఈ ఆఫర్ జూన్ 21, 2026 నుండి జూన్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- ఎంపిక చేసిన ప్లాన్‌లతో అదనపు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMS ప్రయోజనాలు.
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త! ఫాదర్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
BSNL కొత్త ప్రమోషనల్ ఆఫర్ వివరాలు
BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫాదర్స్ డే 2026 సందర్భంగా తమ యూజర్ల కోసం సరికొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు మొబైల్ డేటాను అందిస్తోంది.
ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్కువ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం (BSNL Prepaid Plans) చూస్తున్న కస్టమర్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ #RechargeForPapa అనే సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
Read Also : POCO C81 Pro : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో C81 ప్రో వచ్చేసింది.. 256GB స్టోరేజీ ఫోన్ జస్ట్ రూ. 16వేలకే..!
కంపెనీ ప్రకారం.. ఈ ఆఫర్‌లో రూ. 997, రూ. 1999తో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై బోనస్ డేటా అందిస్తోంది. ఈ అదనపు డేటా కోసం ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు. కుటుంబ సభ్యులు, మీ స్నేహితులతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఈ ప్రమోషనల్ ఆఫర్ జూన్ 21, 2026 నుంచి ప్రారంభమై జూన్ 30, 2026 వరకు వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బోనస్ డేటా కోసం కస్టమర్లు ఈ వ్యవధిలోపు రీఛార్జ్ చేసుకుంటే చాలు..
రూ. 997 ప్లాన్: డబుల్ డేటా, కాల్స్
From your first word to life’s biggest milestones, Dad has always been there.
This Father’s Day, stay connected with extra data from BSNL and make every moment count.
Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c #BSNLIndia #StayConnected #BSNLServices #SmartIndia … pic.twitter.com/j9E8HwmmhH
రూ. 1999 ప్లాన్: లాంగ్ వ్యాలిడిటీ ప్రయోజనాలు
— BSNL India (@BSNLCorporate) June 20, 2026
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ : బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫాదర్స్ డే సందర్భంగా కస్టమర్‌లు ఈ ప్లాన్‌పై అదనంగా 5GB డేటా కూడా పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్ : లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 330 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్‌లు రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కంపెనీ 10GB బోనస్ డేటా కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ వ్యవధిలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు బెస్ట్ అని చెప్పొచ్చు.
ఈ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఎక్కువ వ్యాలిడిటీతో పాటు అదనపు డేటా కోరుకునే వారికి గొప్ప అవకాశం. జూన్ 30, 2026 లోపు రీఛార్జ్ చేసుకుని ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.


