
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈరోజు బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడం మూడు రాశుల వారికి శుభకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Key Points
మిధున, తులా, ధనస్సు రాశుల వారికి బుధుడి పుష్యమి నక్షత్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది.
ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, సంతోషకరమైన కాలం వీరికి ఎదురుచూస్తుంది.
పుష్యమి నక్షత్రం శనికి అధిపత్యం, బుధుడి ప్రవేశం కొత్త అవకాశాలను తెరుస్తుంది.
నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
బుధుడి నక్షత్ర సంచార ప్రభావం
గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు మార్పు చెందినపుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. బుధుడు మరోసారి నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి శుభ ఫలితాను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలని తీసుకువస్తుంది.
జూలై 29, అంటే ఈరోజు సాయంత్రం 4:17కి పుష్యమి నక్షత్రంలోకి బుధుడు అడుగుపెట్టబోతున్నాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. పుష్యమి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారు బుధుడి నక్షత్ర సంచారంతో ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశుల వారికి కలిసి వస్తుంది:
మిధున, తులా, ధనస్సు రాశులకు లాభాలు
మిధున రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్ అందుకుంటారు. విద్య, జర్నలిజం వంటి రంగాల్లో పనిచేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో రాని ధనం మీ చేతికి వస్తుంది. పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు అనుకున్న వాటిని సాధిస్తారు. తోటి ఉద్యోగస్తులు, సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి సమయం లాభదాయకంగా ఉంటుంది.
తులా రాశి వారికి కూడా బుధుడు నక్షత్ర సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పేరు, ప్రతిష్ఠలను పొందుతారు. అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.
జ్యోతిష్య నిపుణుల సూచనలు
ధనస్సు రాశి వారికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయం లో ఈ రాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
బుధుడి పుష్యమి నక్షత్ర సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను అందిస్తుంది. అయితే, ఇవి సూచనలు మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


