
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు మరోసారి వార్తల్లో నిలిచారు. టికెటింగ్ సంస్థ బుక్ మై షో యాప్ రేటింగ్స్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. సినిమా రేటింగ్‌లు నిర్మాతలు నష్టపోవడానికి కారణమవుతాయని నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Key Points
నిర్మాత బన్నీ వాసు బుక్ మై షో రేటింగ్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సినిమా టికెట్ కొనే సమయంలో రేటింగ్ ఇవ్వడం తప్పు అని పేర్కొన్నారు.
రేటింగ్స్ వల్ల సినిమా నిర్మాత నష్టపోతాడని బన్నీ వాసు పరోక్షంగా వెల్లడించారు.
బుక్ మై షో కూడా సినిమా మీదే బతుకుతుందని గుర్తుపెట్టుకోమని వార్నింగ్ ఇచ్చారు.
బుక్ మై షోపై బన్నీ వాసు సీరియస్
: టాలీవుడ్ స్టార్ నిర్మాత బన్నీ వాసు మరోసారి వార్తల్లో నిలిచారు. మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు కదా ? అంటూ టికెటింగ్ సంస్థ బుక్ మై షోపై సీరియస్ అయ్యారు. బుక్ మై షో యాప్, సైట్ లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని నిలదీశారు. జర్నలిస్టులు నిర్ణయాత్మక రివ్యూ ఇస్తున్నారు కదా ? అలాంటప్పుడు మీ యాప్ లో రేటింగ్స్ ఇస్తే ఏంటి లాభం అని ప్రశ్నించారు. దానివల్ల సినిమా నిర్మాత నష్టపోతాడని పరోక్షంగా వెల్లడించారు.
అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడం చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యారు. మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు కదా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా బన్నీ వాసు సమర్పణలో వస్తున్న కొత్త సినిమా మిత్రమండలి. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక NM, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా రేటింగ్స్, నిర్మాతలకు నష్టం
వైరల్ అవుతున్న బన్నీ వాసు కామెంట్స్
మొత్తంగా బన్నీ వాసు వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో రేటింగ్ వ్యవస్థపై కొత్త చర్చకు దారితీశాయి. బుక్ మై షోకు ఆయన ఇచ్చిన హెచ్చరికతో పాటు, ‘మిత్రమండలి’ సినిమా ప్రస్తావన ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

