
రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం విజయోత్సవ సభలో నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన హీరో విజయ్ దేవరకొండను ‘గీతా ఆర్ట్స్ బంగారు కొండ’ అంటూ ప్రశంసించారు. వీరి మాటలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Key Points
రష్మిక నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు.
నిర్మాత బన్నీ వాసు, విజయ్ దేవరకొండను 'గీతా ఆర్ట్స్ బంగారు కొండ' అని ప్రశంసించారు.
గీతా ఆర్ట్స్‌ను విజయ్ తన సొంత సంస్థలా చూసుకుంటారని బన్నీ వాసు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్ మధ్య మరో సినిమాకు సంకేతమని చర్చ జరుగుతోంది.
ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్: విజయ్ దేవరకొండ
Bunny Vasu : రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్‌శెట్టి కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ వచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు (Bunny Vasu) మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘అందరి తరపున విజయ్ భాయ్ థ్యాంక్యూ. గీతా ఆర్ట్స్ అంటే నీ సొంత సంస్థలా చూసుకుంటావు. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బయట విజయ్ దేవరకొండ అయితే మాకు బంగారు కొండ. గీతా ఆర్ట్స్ బంగారు కొండ విజయ్ దేవరకొండ.’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నాయి.
బన్నీ వాసు ప్రశంసలు: గీతా ఆర్ట్స్ బంగారు కొండ
Adah Sharma: వాళ్ళు చంపేస్తాం అన్నారు.. వీళ్ళు కాపాడుతూ వచ్చారు.. అదా శర్మ షాకింగ్ కామెంట్స్
కొత్త ప్రాజెక్టులు: విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్
ఇక విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గీత గోవిందం సినిమాలో నటించారు. ఈ చిత్రం వంద కోట్ల పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు బన్నీ వాసు మాట్లాడిన మాటలను బట్టి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ మరో సినిమాలో నటించనున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బన్నీ వాసు వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్ బంధాన్ని, వారి భవిష్యత్ ప్రాజెక్టుల ఆశలను మరింత పెంచాయి. ఈ కాంబినేషన్‌లో మరో హిట్ సినిమా వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


