
📌 Key Points
- బంగ్లాదేశ్‌లోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద ప్రమాదం
- ఫెర్రీ ఎక్కుతుండగా అదుపు తప్పి పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు
- కొంతమంది ప్రయాణికులు కిటికీల నుంచి బయటపడి సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు
- రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది, ఇద్దరు మృతదేహాలను వెలికితీసింది
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన దౌలత్‌దియా టెర్మినల్ దగ్గర చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదం
బంగ్లాదేశ్ లో పెను విషాదం నెలకొంది. 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు నదిలోకి దూసుకు వెళ్ళింది. బంగ్లాదేశ్ లోని దౌలత్ దియా టెర్మినల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు, ఫెర్రీ ఎక్కుతుండగా అదుపు తప్పింది. ఈ క్రమంలోనే పద్మా నదిలోకి దూసుకెళ్లింది. రేవు నుంచి బస్సు ఫెర్రీ ఎక్కుతుండగా మరో చిన్న పడవ వచ్చి, ఫ్లాట్ ఫామ్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
నదిలోకి దూసుకెళ్లిన బస్సు, ప్రయాణికుల పరిస్థితి విషమం
దీంతో బస్సు వెళ్లి నేరుగా నదిలో పడిపోయింది. అయితే బస్సు నదిలో పడుతున్న క్రమంలో కొంతమంది తెలివిగా కిటికీల నుంచి బయటపడ్డారు. సుమారు 11 మంది ఈదుకుంటూ బయటపడినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణించిన చాలా మంది గల్లంతయినట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ సంఘటన జరగగానే రంగంలోకి దిగింది రెస్యూ టీం. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సహాయక చర్యలు ముమ్మరం
A post shared by GPlus (@guwahatiplus)
ఈ ప్రమాదం బంగ్లాదేశ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.


