|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ సంచలనం: ఒక్కసారిగా కుప్పకూలిన చమురు ధరలు! ఏం జరిగిందంటే?

Published: 07-04-2026, 11:35 PM
ట్రంప్ సంచలనం: ఒక్కసారిగా కుప్పకూలిన చమురు ధరలు! ఏం జరిగిందంటే?
  • ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు.
  • WTI ముడి చమురు ధరలు 13 శాతం పతనం.
  • ఇరాన్‌పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్.
  • హోర్ముజ్ జలసంధిని పునరుద్ధరించాలని ఇరాన్‌కు ట్రంప్ షరతు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

చమురు మార్కెట్లో ట్రంప్ నిర్ణయం ప్రకంపనలు

ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో అమెరికా ముడిచమురు (WTI Crude) ధరలు ఏకంగా 13 శాతం మేర పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ కు 95.06 డాలర్లకు పడిపోయింది. దీంతో అమెరికా మార్కెకాల్పుల విరమణ ఒప్పందం.. భారీగా తగ్గిన చమురు ధరలుట్లు పుంజుకున్నాయి. డౌ ఫ్యూచర్స్ 900 పాయింట్లు ఎకబాకింది. అయితే.. చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, పరిస్థితులు వెంటనే చక్కబడతాయని తాము భావించడం లేదని వెస్ట్‌పాక్ బ్యాంకింగ్ కార్ప్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ రాబర్ట్ రెన్నీ అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ‘సీజ్‌ఫైర్’ (Trump Cease Fire) ప్రకటనతో ఊరట ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు చేస్తామని ఇదివరకు హెచ్చరించిన ట్రంప్, తాజాగా ఆ నిర్ణయంపై రెండు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలతో గడువు ముగియనున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ట్రంప్.. ఇది ‘డబుల్ సైడెడ్’ సీజ్‌ఫైర్ అని పేర్కొన్నారు. అయితే.. దీనికి ప్రతిగా ఇరాన్ వెంటనే ‘హోర్ముజ్ జలసంధి’ని సురక్షితంగా పునరుద్ధరించాలని ఆయన షరతు విధించగా.. అందుకు ఇరాన్ అంగీకరించింది.

భారీగా పతనమైన చమురు ధరలు

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ షరతు

ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయంగా అనేక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరలు మరింత దిగిజారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.