|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాళేశ్వరం ప్రాజెక్టు: లక్ష కోట్ల గోల్ మాల్! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు!

Published: 30-03-2026, 10:35 AM
కాళేశ్వరం ప్రాజెక్టు: లక్ష కోట్ల గోల్ మాల్! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు!
  • కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలే వైఫల్యానికి కారణమని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ అన్నారు.
  • ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారని కేంద్రం విమర్శించింది.
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్​ఎస్​డీఏ నివేదికను కేంద్రమంత్రి ప్రస్తావించారు.
  • జల్‌జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి.

రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు రూపకల్పన లోపాల కారణంగానే లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన ఆరోపించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణాలు

రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్​ పాటిల్ కామెంట్స్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని బీఆర్ఎస్​ సభ్యుడు సురేశ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సురేష్‌ రెడ్డి సమాధానం ఇస్తూ.. కేంద్ర జల్‌శక్తి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం. రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి అనుమతుల కోసం కేంద్రం దగ్గరికి వచ్చారు. ప్రాజెక్టు లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు.’ అని సీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి సి.ఆర్.పాటిల్ కీలక వ్యాఖ్యలు

అంతేకాదు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు మీద ఎన్​ఎస్​డీఏ నివేదికను కూడా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలు కారణం అని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. కాళేశ్వరం లోపాల మీద కేంద్రబృందం అధ్యయనం చేస్తోందన్నారు. జల్‌జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదని తెలిపారు. తెలంగాణ దగ్గర జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లు ఉండగా.. మూడేళ్లలో రూ.194 కోట్లు ఖర్చు చేశారన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం విమర్శలు

మెుత్తానికి రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రణాళిక, రూపకల్పన లోపాల వల్లే ఈ ప్రాజెక్టు ఘోరంగా విఫలమైందన్నారు. రూ.1 లక్ష కోట్ల ప్రజాధనం పూర్తిగా వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కేంద్ర కమిటీ ఈ ప్రాజెక్టుపై విచారణ జరుపుతోందన్నారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.