|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణలో విపత్తుల శిక్షణ కేంద్రం: దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే యత్నం!

Published: 20-03-2026, 9:35 AM
తెలంగాణలో విపత్తుల శిక్షణ కేంద్రం: దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే యత్నం!
  • రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు.
  • విపత్తుల నివారణకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడి.
  • వరదలు, అగ్నిప్రమాదాల సమయంలో త్వరిత స్పందన కోసం డ్రోన్లు, హైస్పీడ్ బోట్ల కొనుగోలు.
  • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధమైన విపత్తు నిర్వహణ శిక్షణ అందించాలని నిర్ణయం.

తెలంగాణ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శిక్ష‌ణా కేంద్రాన్ని (SIDM) ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్న‌త‌స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేసుకొని కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సూచించారు. దీనిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు విపత్తు నిర్వహణపై ఒకే విధమైన శిక్షణను అందిస్తారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించడం వంటి వాటిపై ఫోకస్ చేస్తారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా జిల్లాల్లో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం… విపత్తుల నివారణకు సంబంధించి ఇది ఒక అత్యున్నత పరిశోధన మరియు పాలసీ సపోర్ట్ కేంద్రంగా ఈ కొత్త వ్యవస్థ పని చేస్తుంద‌ని మంత్రి పొంగులేటి వివరించారు.

అత్యాధునిక పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం

శుక్ర‌వారం స‌చివాల‌యంలోని విప‌త్తుల నిర్వ‌హ‌ణా విభాగం, ఫైర్ స‌ర్వీసెస్‌, ఎస్‌డిఆర్ఎఫ్‌, హైడ్రా, ఐసిసిసి విభాగాల‌తో మంత్రి పొంగులేటి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. విపత్తులు సంభవించినప్పుడు కేవలం సహాయక చర్యలకే పరిమితం కాకుండా, ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్’ (SIDM) ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు. విపత్తుల నిర్వహణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు.

ఎటువంటి విప‌త్తుల‌నైనా ఎదుర్కొనేలా అత్యాధునిక ప‌రికరాల‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వ‌ర‌ద‌లు, అగ్నిప్ర‌మాదాలు వంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్ధితుల్లో త్వ‌రిత‌గ‌తిన స్పందించ‌డానికి క‌చ్చిత‌మైన స‌మాచార వ్య‌వ‌స్ధ‌, రియ‌ల్ టైమ్ మానిట‌రింగ్‌, సాధ్య‌మ‌య్యేలా విప‌త్తు ముంద‌స్తు హెచ్చరిక వ్య‌వ‌స్ద‌లు, డ్రోన్‌లు, హైస్పీడ్ బోట్లు వంటివాటిని కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపారు.

సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచన

ఈ స‌మావేశంలో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌, అగ్పిమాప‌క‌శాఖ డైరెక్ట‌ర్ విక్ర‌మాన్ సింగ్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాధ్‌, ఐసిసిసి డైరెక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌రెడ్డి, స్పెష‌ల్ పోలీస్ బెటాలియ‌న్ అడిష‌న‌ల్ డిజీ సంజ‌య్ జైన్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మొత్తానికి, విపత్తుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.