|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘చాయ్ వాలా’ విడుదల వాయిదా! అసలు కారణం ఇదేనా? ఫిబ్రవరి 20న థియేటర్లలోకి!

Published: 04-02-2026, 1:35 PM
‘చాయ్ వాలా’ విడుదల వాయిదా! అసలు కారణం ఇదేనా? ఫిబ్రవరి 20న థియేటర్లలోకి!
  • శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
  • రాజీవ్ కనకాల, తేజు అశ్విని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
  • ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.
  • తండ్రీ కొడుకుల అనుబంధంలోని ఎమోషన్స్ అందరినీ కట్టిపడేస్తాయని శివ కందుకూరి అన్నారు.

శివ కందుకూరి హీరోగా నటిస్తున్న ‘చాయ్ వాలా’ సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని హర్షిక ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

ఫిబ్రవరి 6న విడుదల కావాల్సిన సినిమా వాయిదా

Chai Wala: శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’ (Chai Wala). రాజీవ్ కనకాల (Rajeev Kanakala), తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష (Pramod Harsha) ఈ మూవీకి దర్శకత్వం వహించగా, వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కొన్ని అనుకోని కారణాలతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

హర్షిక ప్రొడక్షన్స్ ప్రకటనలో ఏముందంటే?

హర్షిక ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే.. ‘‘ముందస్తుగా ఊహించని కొన్ని అనివార్య కారణాల వల్ల, మా రాబోయే చిత్రం ‘చాయ్‌ వాలా’ (CHAI WALA) విడుదల తేదీని మారుస్తున్నామని మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు హర్షిక ప్రొడక్షన్స్ తెలియజేస్తోంది. మొదట ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, ఇప్పుడు ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. మీరు మాపై చూపిస్తున్న నిరంతర మద్దతు, అవగాహనకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కొత్త తేదీన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని టీమ్ హర్షిక ప్రొడక్షన్స్ పేర్కొంది.

సినిమా గురించి హీరో శివ కందుకూరి ఏమన్నారంటే?

ఇక సినిమా గురించి ఇటీవల హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాయ్ వాలా’ సినిమాని ఎంత కష్టపడి, ఇష్టపడి చేశాము. టీమ్ మొత్తం ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ మూవీలోని ఎమోషన్ అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, అలాగే బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో చాలా బాగా చూపించాం. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌లో రాజీవ్ కనకాల ప్రాణం పెట్టేశారు. రాజీవ్ కనకాల వంటి అద్భుతమైన నటుడుతో యాక్ట్ చేయడంతో నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో వస్తుంది. కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. అందరూ థియేటర్లకు వచ్చి, ఈ సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ‘చాయ్ వాలా’ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల అనుబంధం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుందని హీరో శివ కందుకూరి తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.