
నాగ చైతన్య తన ఇటీవలి ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ సుష్మితా సేన్ అని, అలియా భట్ తో సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Key Points
నాగ చైతన్య తన ఫస్ట్ క్రష్ సుష్మితా సేన్ అని వెల్లడించాడు.
అలియా భట్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోనని చెప్పాడు.
ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లతో నటించాలని కోరుకుంటున్నాడు.
నెటిజన్లు చైతన్య కామెంట్స్ పై విభిన్నంగా స్పందిస్తున్నారు.
చైతన్య కామెంట్స్ వైరల్
అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్‌గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ‘ఎన్‌సి-24’(NC-24) సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. చైతూ గతంలో తన ఫస్ట్ ఎవరనే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో సైతం చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
భవిష్యత్తులో హిందీలో ఎవరితో పనిచేయాలని ఉందని యాంకర్ ప్రశ్నించగా.. చైతూ స్పందిస్తూ.. ‘నా ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్(Sushmithasen). ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు సైతం చెప్పాను. అలాగే అలియా భట్(AliaBhatt) యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో సినిమా చేసే చాన్స్ వస్తే అస్సలు వదులుకోను. అలాగే ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ హీరోయిన్లతో నటించాలని ఉంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చైతన్య కామెంట్స్ పై నెటిజన్లు షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు.
సుష్మితా సేన్ పై చైతన్య ప్రేమ
A post shared by Sushmita Sen (@sushmitasen47)
నెటిజన్ల రియాక్షన్
రేర్ పిక్.. భార్యతో అక్కడ సెల్ఫీ తీసుకున్న నాగ చైతన్య.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
చివరగా, నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడుతున్నాయి. ఆయన భవిష్యత్తు సినిమా ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


