|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డార్క్ కామెడీ జానర్‌లో చాందిని చౌదరి.. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన హీరోయిన్

Published: 03-11-2025, 8:11 AM
డార్క్ కామెడీ జానర్‌లో చాందిని చౌదరి.. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి కొత్త సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘కలర్’ ఫొటోతో గుర్తింపు పొందిన ఈ నటి, తన తాజా సినిమా ప్రారంభోత్సవం వివరాలను పంచుకుంది. ఈ చిత్రానికి వికాస్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన గోపాల్ నిర్మిస్తున్నారు.

Key Points

1

చాందినీ చౌదరి కొత్త సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం ప్రారంభం.

2

వికాస్ దర్శకత్వంలో, సృజన గోపాల్ నిర్మాణంలో సహచారి క్రియేషన్స్ పై సినిమా.

4

నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం, కాన్సెప్ట్ వీడియో త్వరలో.

చాందినీ చౌదరి కొత్త ప్రాజెక్ట్ వివరాలు

‘కలర్’ ఫొటో చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చాందినీ చౌదరి.. ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో బిజీగా ఉంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. తాజాగా మరో కొత్త సినిమా మొదలు పెట్టింది. చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ నిర్మాస్తుండగా.. వికాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతుండగా.. తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది హీరోయిన్. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగినట్లు తెలుపుతూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాన్ కొట్టి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ.. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానెర్లో ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది సహచారి క్రియేటషన్స్. ఎవరూ ఊహించని ఒక సూపర్ హీరోని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాము. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను త్వరలోనే విడుదల చేస్తాము. నవంబర్ చివరిలో హైదరాబాద్‌‌లో షూటింగ్ ప్రారంభం కానుంది’ అని చెప్పుకొచ్చాడు.

సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ: చిత్ర బృందం ఏమంటుంది?

హీరోయిన్ చాందినీ చౌదరి కెరీర్ గ్రాఫ్

ఈ సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. నవంబర్ చివరి నుండి హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ఒక సూపర్ హీరోని పరిచయం చేయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.