|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చంద్రహాస్‌ ‘బరాబర్ ప్రేమిస్తా’ షాకింగ్ కలెక్షన్స్! టీ ఖర్చులకు కూడా చాలలేదా? మామూలు షాక్ కాదు ఇది!

Published: 09-02-2026, 11:05 AM
చంద్రహాస్‌ 'బరాబర్ ప్రేమిస్తా' షాకింగ్ కలెక్షన్స్! టీ ఖర్చులకు కూడా చాలలేదా? మామూలు షాక్ కాదు ఇది!
  • చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ విడుదల.
  • తొలిరోజు కలెక్షన్స్ రూ.25 లక్షలు, రెండో రోజు రూ.19 లక్షలు మాత్రమే.
  • మూడు రోజుల్లో కేవలం రూ.56 లక్షలు మాత్రమే వసూలు.
  • మేఘనా ముఖర్జీ హీరోయిన్, సంపత్ రుద్ర దర్శకత్వం.

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందా? కలెక్షన్స్ చూస్తే దిమ్మతిరిగే షాక్! అసలు ఏం జరిగిందో తెలుసా?

మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన సినిమాల కంటే వివాదాలతోనే వైరల్‌గా మారుతున్నాడు. ఇటీవల `గుంజి గుంజి` పాటలో వల్గర్‌ పదాలు వాడి వివాదంలో ఇరుక్కున్నాడు. దారుణంగా ట్రోల్స్ కి గురయ్యాడు. ఇక ఆయన హీరోగా లేటెస్ట్ గా నటించిన `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. వివాదం నడించినంత బ్యాడ్‌ గా అయితే సినిమా లేదు. కులం, పరువు హత్యల ప్రధానంగా సినిమాని రూపొందించారు, కానీ వివాదంలో పడి దీన్ని ఎవరూ పట్టించుకోలేదు.

సాధారణంగా సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి వివాదం చేస్తుంటారు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్‌ అవుతుందని, కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తుంటారు. కానీ చంద్రహాస్‌ చేసిన వివాదం ఈ మూవీకి ప్లస్‌ కాలేదు కదా, మరింత మైనస్‌గా మారింది. కనీసం సినిమాని పట్టించుకునే నాదుడే లేదు. థియేటర్లలో సీట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. బుక్‌ మై షో వంటి వాటిలో 99శాతం ఖాళీగానే ఉన్నాయి.

వివాదమే శాపంగా మారిందా?

`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మూవీకి చాలా చోట్ల కనీసం టీ ఖర్చులు కూడా రావడం లేదట. ఈ సినిమాని దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం. అయితే వసూళ్లు చూస్తే.. మొదటి రోజు రూ.25లక్షల వరకు వచ్చాయని, అలాగే రెండో రోజు రూ.19లక్షలు వచ్చాయని, మూడో రోజు ఆదివారం రూ.12లక్షలు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా మూడు రోజులు రూ.56 లక్షలు వచ్చాయి. ఇందులో షేర్‌ చూస్తే రూ.30 లక్షల లోపే ఉందని చెప్పొచ్చు.  చాలా చోట్ల కనీసం థియేటర్‌ ఖర్చులు కూడా రావడం లేదని, జీరో షేర్‌ కే పరిమితమయ్యిందని సమాచారం.

చంద్రహాస్‌ హీరోగా నటించిన `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, అభయ్‌ నవీన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఆద్యంతం లవ్‌ అండ్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీలో కులానికి సంబంధించి అందించిన సందేశం బాగుంది.

థియేటర్ల దగ్గర పరిస్థితి ఏంటి?

అయితే సినిమాని పాజిటివ్‌గా ప్రమోట్‌ చేసి ఉంటే అది మూవీకి హెల్ప్ అయ్యేది. కానీ వివాదాలకు ప్రయారిటీ ఇవ్వడంతో అది కాస్త సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. కంటెంట్‌ని ఆడియెన్స్ కి దగ్గర చేస్తూ వెళితే డీసెంట్‌ కలెక్షన్లు వచ్చేవి, కనీసం ప్రశంసలైనా దక్కేవి. అనవసర వివాదం సినిమాని కిల్‌ చేశాయని చెప్పొచ్చు.

‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ కలెక్షన్స్ పరిస్థితి ఇది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ Tollywood సమాచారం కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.