
సెప్టెంబర్ 7న చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల కర్కాటక, తులా, కుంభ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం అవుతుంది. డబ్బు, ఉద్యోగాలు, ప్రేమ విషయాలలో శుభ ఫలితాలు అందుతాయి.
Key Points
కర్కాటక, తులా, కుంభ రాశుల వారికి చంద్రుని అనుగ్రహం.
డబ్బు, ఉద్యోగాలు, సంతోషం పెరుగుతుంది.
సంబంధాలు బలపడతాయి, ప్రేమ పెరుగుతుంది.
వ్యాపారంలో లాభాలు, ఆర్థిక ప్రగతి.
కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు
ద్రిక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7 రాత్రి 9:40కి చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే విధంగా పూర్వభద్ర నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తాడు. చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలో సెప్టెంబర్ 8 రాత్రి 8:02 వరకు ఉంటాడు. చంద్రుని సంచారంలో మార్పు రావడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే 12 రాశుల వారిపై ప్రభావం పడినా మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.
ఈ మూడు రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చంద్రుని సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. తల్లితో వారి బంధం దృఢంగా మారుతుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.
మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు. ఇలా అనేక మార్పులు చంద్రుని మార్పుతో చోటు చేసుకుంటాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
తులా రాశి వారికి ఆర్థిక ప్రగతి
చంద్రుని సంచారంలో మార్పు.. ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు
కర్కాటక రాశి వారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. పెళ్లి కాని వారికి సంబంధాలు వారి వద్దకు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. దీంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. బాధ్యతలు తగ్గుతాయి, మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు భారీ మొత్తంలో లాభాలు వస్తాయి.
తులా రాశి వారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉంటున్న వారు సంతోషంగా ఉంటారు. దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది, వివాహానికి దారి తీస్తుంది. వృద్ధులకు సంతోషం ఉంటుంది. ఆర్థికపరంగా కూడా మీకు బాగుంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.
కుంభ రాశి వారికి సంతోషకరమైన కాలం
కుంభ రాశి వారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం, భారీగా లాభాలను పొందుతారు. రిలేషన్‌షిప్‌లో ఉన్న టెన్షన్స్ తొలగిపోతాయి. భార్యా భర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
చంద్రుని సంచారం మూడు రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.


