
టాలీవుడ్ నటి శ్రీ సత్య తాజాగా తన పెళ్లి గురించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన శ్రీ సత్య, ‘నేను పెళ్లి చేసుకోను’ అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు కారణం ఏమిటో తెలియరాలేదు.
Key Points
శ్రీ సత్య తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని తెలిపారు.
ప్రేమ విఫలమైనట్లుగా నెటిజన్లు అనుమానిస్తున్నారు.
శ్రీ సత్య సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సోషల్ మీడియాను నమ్ముకొని ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తమకు తెలిసిన వాళ్లను పట్టుకొని.. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇక మరికొంతమంది నేరుగా ఇండస్ట్రీకి వచ్చి అదృష్టాన్ని… పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పెళ్లిపై ఆమె అభిప్రాయాలు
అయితే అచ్చం అలాగే శ్రీ సత్య అనే యువ నటి కూడా ఇండస్ట్రీలో… ముందుకు సాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీ సత్య… బిగ్ బాస్ ద్వారా మాత్రం బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చి… ఆ తర్వాత స్టార్ అయిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆమెకు మంచి గుర్తింపు దక్కుతోంది.
నెటిజన్ల స్పందన
అయితే అలాంటి శ్రీ సత్య… తాజాగా తన పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛీ… ఛీ నేను పెళ్లి చేసుకోను… ఆ ఆశ లేదు.. ఆ ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఆమె చేసిన కామెంట్లపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయినట్లు ఉంది.. అందుకే శ్రీ సత్య ఇలా మాట్లాడిందని అంటున్నారు.
శ్రీ సత్య చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మాటలకు నెటిజన్లు వివిధ రకాల ప్రతిస్పందనలు ఇస్తున్నారు. ఈ ఘటన సినీ ప్రేక్షకులలో చర్చకు దారితీసింది.


