|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్లాస్టిక్‌కు వీడ్కోలు చెప్పండి! బ్యాగ్ ఫ్రీగా పొందండి – మెరీనా బీచ్ సంచలనం!

Published: 03-04-2026, 3:05 AM
ప్లాస్టిక్‌కు వీడ్కోలు చెప్పండి! బ్యాగ్ ఫ్రీగా పొందండి - మెరీనా బీచ్ సంచలనం!
  • చెన్నై మెరీనా బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపుకు సరికొత్త ప్రయత్నం.
  • ప్లాస్టిక్ బాటిల్ డిపాజిట్ చేస్తే ఉచితంగా ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్ అందిస్తున్నారు.
  • పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్మార్ట్ రీసైక్లింగ్ విధానం.

చెన్నై మెరీనా బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఉచితంగా ఎకో-ఫ్రెండ్లీ బ్యాగులు అందిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప ముందడుగు.

మెరీనా బీచ్‌లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ విప్లవం

పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పర్యావరణానికి పెను సవాలుగా మారుతోంది. ఆధునిక జీవనశైలిలో మానవులకు ప్లాస్టిక్ ఇప్పుడు ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో అనేక పర్యాటక ప్రాంతాల్లో ప్లాసిక్ వ్యర్థాలు కుప్పులు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించేలా చెన్నైలోని ప్రముఖ మెరీనా బీచ్‍లో వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్లాసిక్ బాటిల్ డిపాజిట్ చేస్తే ఉచితంగా ఎకో-ఫ్లెండ్లీ బ్యాగ్‍లు ఇచ్చేలా సరికొత్త మిషన్ ను బీచ్ లో ఏర్పాటు చేశారు.

దీంతో ఇప్పుడు బీచ్ కు వస్తున్న పర్యాటకులు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడా ఇక్కడా పారేయకుండా ఈ మిషన్ వద్ద డిపాజిట్ చేసి ఉచితంగా పర్యావరణ సరిత బ్యాగులు తీసుకుంటున్నారు. ఇందుకు సంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు స్పందిస్తూన్నారు. ఇలాంటి ‘స్మార్ట్’ రీసైక్లింగ్ పద్దతులు దేశంలోని మిగతా అన్ని నగరాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఉచిత బ్యాగులు.. పర్యావరణానికి ప్రోత్సాహం

వైరల్ అవుతున్న స్మార్ట్ రీసైక్లింగ్ విధానం

ఈ స్మార్ట్ రీసైక్లింగ్ విధానం పర్యావరణ పరిరక్షణకు ఒక మంచి ప్రారంభం. ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తే ప్లాస్టిక్ సమస్యను నివారించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.