|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హార్మూజ్ సంక్షోభం: చైనా పన్నాగాలు, భారత్‌కు ముప్పు తప్పదా?

Published: 06-04-2026, 5:05 AM
హార్మూజ్ సంక్షోభం: చైనా పన్నాగాలు, భారత్‌కు ముప్పు తప్పదా?
  • హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది.
  • చైనా, ఇరాన్‌తో కలిసి హార్మూజ్ జలసంధిని నియంత్రించాలని చూస్తోందని నిపుణుల హెచ్చరిక.
  • చైనా ప్రయత్నాలు భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
  • గల్ఫ్ దేశాలలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిపై చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారత్‌కు ఆర్థికపరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.

హార్మూజ్ జలసంధిలో చైనా వ్యూహాలు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హార్మూజ్ (Strait of Hormuz) జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నౌకల రాకపోకలపై ఇబ్బందులు ఏర్పడటంతో భారత్ సహా అనేక దేశాలకు వస్తురవాణా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఈ హర్మూజ్ ను తెరిచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు చైనా (China) తన ఒరిజినాలిటీని బయటపెట్టే ప్రయత్నం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని హార్మూజ్ జలసంధిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి చైనా పావులు కదుపుతోందని ఆప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జియా (Saurabh Mukherjea) తాజాగా ఓ జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇరాన్‌తో చేతులు కలిపి చైనా హార్మూజ్ జలసంధిని తన అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సౌరభ్ పేర్కొన్నారు. ఇది జరిగితే ప్రపంచ చమురు సరఫరాలో ఎక్కువ భాగం చైనా చేతుల్లోకి వెళ్తుందని ఇది చైనాకు దక్కే అతిపెద్ద వ్యూహాత్మక విజయం అవుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం స్వల్పకాలిక గొడవ మాత్రమే కాదు చమురు, వ్యూహాత్మక శక్తి కోసం జరుగుతున్న పోరాటం అన్నారు. హర్మూజ్ భారత (Indian) ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. చైనా తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పటికే ఇరాన్‌తో 25 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న బీజింగ్, అమెరికా ఆంక్షలను ధిక్కరించి ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. యూఏఈ, ఓమన్, ఇరాన్, పాకిస్థాన్‌లలో ఓడరేవులు, పైప్‌లైన్లు, రైల్వే నెట్‌వర్క్ కోసం చైనా బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో హార్మూజ్ పై చైనా ఆధిపత్యం పెరిగితే అది భారత్ పై కూడా ఎఫెక్ట్ చూపే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత్ పై ఆర్థిక ప్రభావం

చైనా-ఇరాన్ ఒప్పందం

హార్మూజ్ జలసంధి విషయంలో చైనా యొక్క ఎత్తుగడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.