
📌 Key Points
- ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ తెలిపిన వారికి రూ. 93 కోట్ల బహుమానం ప్రకటించిన అమెరికా.
- మొజ్తాబా సమాచారం ఇచ్చిన వారికి అమెరికాలో శాశ్వత నివాసం కల్పిస్తామని హామీ.
- మొజ్తాబాతో పాటు అలీ అస్గర్ హెజాజీ, అలీ లారిజాని పేర్లను కూడా ప్రస్తావించిన యూఎస్.
- ఉగ్రవాదానికి వీరే కారణమని ఆరోపిస్తూ, సమాచారం చేరవేయాలని అమెరికా పిలుపు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొజ్తాబా ఎక్కడు ఉన్నారో చెబితే వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.93 కోట్లు) ఇస్తామని యూఎస్ విదేశాంగశాఖ ప్రకటన చేసింది. మొజ్తాబాతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఉగ్రవాదానికి వీరే కారణమని ఆరోపించింది. వీరు ఎక్కడున్నారో సమాచారం ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలియజేయాలని కోరింది. ఇందుకు తగిన ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపింది. పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి అమెరికాలో శాశ్వత నివాసం కల్పిస్తామని చెప్పింది.
మొజ్తాబాపై భారీ రివార్డు
సమాచారం తెలిపితే శాశ్వత నివాసం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ పరిణామం ఇరాన్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


