|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గోవా బీచ్‌లో విషాదం: ఫోటోల మోజులో యువకుడి ప్రాణత్యాగం!

Published: 24-06-2026, 11:03 PM
గోవా బీచ్‌లో విషాదం: ఫోటోల మోజులో యువకుడి ప్రాణత్యాగం!
  • గోవా బాగా బీచ్‌లో ఫోటోలు దిగుతూ యువకుడు సముద్రంలో గల్లంతు.
  • మాన్ సూన్ కారణంగా అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రమాదం.
  • కర్ణాటక బీజాపూర్‌కు చెందిన యువకుడిగా గుర్తింపు.
  • ప్రమాదకరమైన అలల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచన.

గోవా బాగా బీచ్‌లో ఫోటోల పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన యువకుడు, ప్రమాదకరమైన అలల మధ్య ఫోటోలు దిగే ప్రయత్నంలో సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఫోటోల మోజులో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

గోవాలో ఫోటోల పిచ్చి ఓ యువ‌కుడి ప్రాణం తీసింది. స్నేహితుల‌తో ట్రిప్ కు వెళ్లిన యువ‌కుడు స‌ర‌దాగా గ‌డ‌ప‌కుండా ఫోటోల కోసం బీచ్ లోని ఓ రాయిపై కూర్చుని ఫోటోలు దిగే ప్ర‌య‌త్నం చేశాడు. అప్ప‌టికే స‌ముద్రంలోని అలలు ఎగిసిప‌డ‌గా అవి మ‌రింత దూసుకువ‌చ్చాయి. దీంతో రాయిపై కూర్చున్న యువ‌కుడు స‌ముద్రంలో ప‌డిపోయాడు. ఒడ్డుకురావాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా అల‌లు అతడిని ముంచేశాయి. దీంతో బ‌య‌ట‌కు రాలేక స‌ముద్రపు నీటిలోనే గ‌ల్లంత‌య్యాడు.

ఈ ఘ‌ట‌న బాగా బీచ్ లో చోటు చేసుకుంది. యువ‌కుడిని క‌ర్నాట‌క రాష్ట్రం బీజాపూర్ కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. మాన్ సూన్ కావ‌డంతో అల‌ల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల యువ‌కుడు కొట్టుకుపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. యువ‌కుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు నిర్దారించారు. ప్ర‌స్తుతం మాన్ సూన్ సీజ‌న్ కావ‌డంతో అల‌ల తాకిడి ఎక్కువగా ఉంటుంద‌ని స‌ముద్రం ఎప్పుడు ఎలా ఉప్పొంగుతుందో తెలియ‌ద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. బీచ్ కు వ‌చ్చిన‌వాళ్లు జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

గోవా బాగా బీచ్‌లో విషాద ఘటన

మాన్ సూన్ ప్రమాదాలపై పోలీసుల హెచ్చరికలు

మాన్ సూన్ సమయంలో సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉంటుందని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోటోల మోజులో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.