
📌 Key Points
- నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పబ్లిక్‌గా మండిపడ్డారు.
- ఆయనను ఉద్దేశించి సింగర్ చిన్మయి శ్రీపాద ‘ఇన్సెల్ బాయ్’ అనే పదాన్ని ప్రయోగించారు.
- ‘ఇన్సెల్’ అంటే తాము కోరుకున్నా అమ్మాయిలు ఇష్టపడలేదని స్త్రీల పట్ల ద్వేషంతో ఉండేవారు.
- శివాజీ వ్యాఖ్యలు, చిన్మయి ‘ఇన్సెల్’ కౌంటర్ టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.
నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. దీనిపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. శివాజీని ఉద్దేశించి ఆమె ‘ఇన్సెల్ బాయ్’ అనడం కొత్త చర్చకు దారితీసింది. అసలు ‘ఇన్సెల్’ అంటే ఏమిటి, ఈ పదం బూతా కాదా అనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు, హీరోయిన్లపై విమర్శలు
Chinmayi : నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఆయన నటించిన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. హీరోయిన్ల డ్రెస్సులపై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందరూ చక్కగా చీరలు కట్టుకుని రావాలంటూ శివాజీ హితవు పలికారు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు వేసుకుంటూ సామాన్లు మొత్తం చూపిస్తాన్నారని అంటూ నేటితరం హీరోయిన్లపై మండిపడ్డారు. ఆయన అక్కడితో ఆగకుండా కొన్ని బూతు పదాలు సైతం ఉపయోగించారు.
మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతారు కానీ ఇలాంటి బట్టలు వేసుకుంది దరిద్రపు ము**డా అని లోపల తిట్టుకుంటారని వ్యాఖ్యానించారు. సావిత్రి, సౌందర్యలాగా ఉండాలని, అంతే కాని మేం చూపిస్తామంటే సరైంది కాదంటూ శివాజీ హీరోయిన్లకు క్లాస్ పీకారు. అయితే హీరోయిన్ల కట్టు బొట్టులపై కామెంట్స్ చేసిన శివాజీపై మహిళాలోకం మండిపడుతోంది. ఈ వివాదంపై పలువురు సినీ సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు.
చిన్మయి ‘ఇన్సెల్ బాయ్’ కౌంటర్ – అసలు అర్థం ఏమిటి?
అయితే ఈ మొత్తం గొడవలో చిన్మయి వాడిన ఒక ఇంగ్లీష్ పదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శివాజీని ఉద్దేశించి ఆమె “Incel Boy” (ఇన్సెల్ బాయ్) అనే పదాన్ని ప్రయోగించారు. ఈ పదం వినడానికి కొత్తగా ఉండటంతో చాలామంది దీని అర్థం కోసం గాలించడం మొదలుపెట్టారు. అసలు ఈ ‘ఇన్సెల్’ అనే పదానికి అర్థం ఏమిటంటే.. తాము ఎంత కోరుకున్నా ఏ అమ్మాయి తమను ఇష్టపడటం లేదనే అసహనంతో ఉండేవారు. ఈ అసహనం కాలక్రమేణా స్త్రీల పట్ల ద్వేషంగా మారుతుంది. ఏ అమ్మాయి తమ దరికి చేరకపోవడానికి గల కారణాలను వెతుక్కోకుండా, మహిళా లోకాన్ని లేదా వారి స్వేచ్ఛను విమర్శించే పురుషులను సూచించడానికి ఈ పదాన్ని నెగటివ్ సెన్స్‌లో వాడుతుంటారు.
టాలీవుడ్‌లో కొత్త చర్చ: మహిళల గౌరవంపై ప్రశ్నలు
ఒక సినిమాలో విలన్ పాత్ర పోషించిన శివాజీ, ఇప్పుడు నిజ జీవితంలో కూడా మహిళల పట్ల ‘పోకిరి’ భాష వాడుతున్నారని చిన్మయి మండిపడ్డారు. గౌరవం అనేది వ్యక్తి వేసుకునే బట్టల్లో ఉండదని, చూసే దృష్టిలో ఉంటుందని ఆమె వాదన. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు, దానికి చిన్మయి ఇచ్చిన ‘ఇన్సెల్’ కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒక సీనియర్ నటుడు పబ్లిక్ వేదికపై మహిళల పట్ల అంత దారుణమైన పదజాలం వాడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి శివాజీ వ్యాఖ్యలు, చిన్మయి ‘ఇన్సెల్’ కౌంటర్ టాలీవుడ్‌లో మహిళల పట్ల గౌరవం, వారి స్వేచ్ఛపై పెద్ద చర్చకు తెరలేపాయి. ఒక పదం యొక్క అర్థం, దాని ప్రభావంపై జరుగుతున్న ఈ వాదన సినీ వర్గాలలో ఆలోచనలను రేకెత్తిస్తోంది.


