
📌 Key Points
- వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించడంతో చిన్మయి తీవ్ర విమర్శలు, లైంగిక వేధింపుల ఆరోపణలను గుర్తు చేసింది.
- కమల్ హాసన్, వైరముత్తు స్నేహాన్ని ప్రస్తావిస్తూ, బాధితుల గొంతు వినడానికి రాజకీయ ప్రముఖులు నిరాకరిస్తున్నారని చిన్మయి ఆరోపణ.
- నిజం మాట్లాడినందుకు తనను తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్, సింగింగ్ పరంగా నిషేధించారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.
- పురుషులు ఎప్పుడూ తమ స్నేహితుల పక్షానే ఉంటారని, మహిళల ఆవేదనను పట్టించుకోరని చిన్మయి ఘాటు వ్యాఖ్యలు.
భారతీయ సాహిత్యంలో జ్ఞానపీఠ్ పురస్కారం ఒక తమిళ రచయితకు దక్కడం సంతోషకరమైన విషయమే అయినా, వైరముత్తుకు ఈ అవార్డు రావడం వివాదాస్పదంగా మారింది. చిన్మయి శ్రీపాద చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
వైరముత్తుకు జ్ఞానపీఠ్: చిన్మయి ఆగ్రహం
Chinmayi Sripada: భారతీయ సాహిత్యంలో అత్యున్నత శిఖరంగా భావించే జ్ఞానపీఠ్ పురస్కారం దశాబ్దాల తర్వాత ఒక తమిళ సాహితీవేత్తను వరించడం తమిళనాట ఒక చారిత్రాత్మక ఘట్టం. అయితే, ప్రముఖ కవి వైరముత్తుకు ఈ గౌరవం ప్రకటించిన క్షణం నుంచే అభినందనలను మించి వివాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2018లో దేశాన్ని కుదిపేసిన #MeToo ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
రచయిత వైరముత్తుపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada), ఈ పురస్కార ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసేటప్పుడు వ్యక్తిగత ప్రవర్తనను, నైతికతను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంలో కేవలం వైరముత్తు మాత్రమే కాకుండా, ఆయనను సమర్థిస్తున్న సినీ, రాజకీయ దిగ్గజాలపై కూడా చిన్మయి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకనాయకుడు కమల్ హాసన్ ను కూడా ఆమె టార్గెట్ చేశారు.
కమల్ హాసన్ పై చిన్మయి విమర్శలు
జయకాంతన్ తర్వాత 20 ఏళ్లకు ఒక తమిళుడికి ఈ గౌరవం దక్కడం గర్వకారణమని, వైరముత్తు తన ఆప్తమిత్రుడని కొనియాడుతూ కమల్ హాసన్ పోస్ట్ పెట్టడం వివాదంగా మారింది. ఏఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. “సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులు బాధితుల గోడును వినడానికి నిరాకరిస్తున్నారు” అంటూ కమల్ వైఖరిని ఆమె తప్పుబట్టారు. పురుషులు ఎప్పుడూ తమ ‘బ్రదర్స్, అంకుల్స్, ఫ్రెండ్స్’ వైపే నిలబడతారని, మహిళల ఆవేదన కంటే వారి స్నేహాలకే విలువ ఇస్తారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి తెరపైకి
నిజం మాట్లాడినందుకు తాను తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్, సింగింగ్ పరంగా అనధికారిక నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఎంతోమంది మహిళల గొంతును వ్యవస్థాగతంగా తొక్కేశారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో మహిళలు తమ కలలను వదులుకున్నా పట్టించుకోని ఈ సమాజం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అగ్రతాంబూలం ఇవ్వడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆమె ఆరోపించారు. సాహితీ గౌరవానికి, సామాజిక నైతికతకు మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు కేవలం ఒక అవార్డు చుట్టూ కాకుండా, బాధితుల గొంతుకను వినే వ్యవస్థ ఉందా లేదా అనే పెద్ద ప్రశ్నగా రూపాంతరం చెందింది. అంటూ ఆమె కామెంట్స్ చేశారు. దాంతో, చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


