|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా? మెగా ఫ్యాన్స్‌కి పండగే!

Published: 28-02-2026, 6:05 AM
చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా? మెగా ఫ్యాన్స్‌కి పండగే!
  • మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
  • ఒక ప్రముఖ దర్శకుడు ఇద్దరు స్టార్ హీరోల కోసం ఒక ప్రత్యేక కథను సిద్ధం చేశారట.
  • చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ వర్గాల అంచనా.
  • అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్లు, ఎడిట్లు వైరల్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ సినిమా వార్తలు ఊపందుకున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

మెగా కాంబో కోసం ఎదురుచూపులు

Mega Multi-starrer: టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. మెగా కుటుంబ అభిమానులను ఉర్రూతలూగించేలా, చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కలిసి మళ్లీ ఒకే సినిమాలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది నిజమైతే.. ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద సంఘటనగా నిలవనుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..ఒక పేరున్న తెలుగు దర్శకుడు ఇటీవల ఇద్దరు స్టార్‌లకూ ఒక కథను వినిపించాడట. ఆ కథ చాలా బలంగా.. ఉండటమే కాకుండా, మెగాస్టార్.. పవర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ విషయం బయటపడిన దగ్గర నుంచి మెగా అభిమానుల్లో సందడి మొదలైపోయింది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ తమ సినిమాలు..ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అందుకే ఈ చర్చలు చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయట. అయినా కూడా.. ఈ సినిమాకి అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయని, ఇద్దరూ మెగా హీరోలు కూడా ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు వినిపించిన కథ

ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే తెరపై కనిపిస్తే అది పండగ లాంటి సందర్భమే. వారి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పాపులారిటీ కలిసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తయారు చేసిన పోస్టర్లు, ఎడిట్లు, ఊహాజనిత సీన్లు వైరల్ అవుతున్నాయి.

గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు కూడా ఫుల్ లెన్త్ సినిమాలో కనిపివ్వలేదు. అప్పటి నుంచి మళ్లీ వారిద్దరినీ కలిసి చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు ఆ ఆశలను మరోసారి పెంచాయి.

సినిమాపై అంచనాలు

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, భారీ బడ్జెట్‌తో, టాప్ టెక్నీషియన్లు, మంచి సంగీతంతో, గొప్ప నిర్మాణ విలువలతో రూపొందే అవకాశముంది. ఈ సినిమా ప్రకటన ఒక్కటే ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుందని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ వార్త నిజమైతే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.