|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి ‘మెగా 158’: బాబీతో కలిసి మరో సంచలనానికి సిద్ధం! షూటింగ్ ఎప్పుడంటే?

Published: 13-02-2026, 2:35 AM
చిరంజీవి ‘మెగా 158’: బాబీతో కలిసి మరో సంచలనానికి సిద్ధం! షూటింగ్ ఎప్పుడంటే?
  • చిరంజీవి, బాబీ కాంబోలో ‘మెగా 158’ చిత్రం మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది.
  • ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉంది, ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.
  • KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది, ఇది వారి తెలుగు మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ చిత్రం షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మార్చిలో ‘మెగా 158’ ప్రారంభం!

Chiranjeevi Bobby: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుకానుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మళ్లీ జతకడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం (మెగా 158), మార్చి మొదటి వారంలో ఘనంగా ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి మొదటి వారంలో ఒక మంచి ముహూర్తాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ఖచ్చితమైన తేదీ ఖరారు కానప్పటికీ, చిత్ర యూనిట్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Read also- Sravanthi Chokarapu: చీర కట్టులో స్రవంతి అందాలు.. ఏం అందం బాబోయ్!

చిరంజీవి, బాబీ కాంబోలో మరో హిట్?

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి విన్నర్‌గా నిలిచి, చిరంజీవి వింటేజ్ మాస్‌ను వెండితెరపై ఆవిష్కరించింది. మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు బాబీ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, కథలో బలమైన ఎమోషన్ ఒక సామాజిక సందేశం కూడా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. కన్నడలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్స్, ఈ సినిమాతో తెలుగు మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత సాంకేతిక విలువల తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Read also- Podarillu Today Episode : మాధవ్ పై మహా కు అనుమానం.. కొత్త ఫ్యామిలీతో ట్విస్ట్.. చక్రీకి షాక్..

భారీ బడ్జెట్‌తో KVN ప్రొడక్షన్స్ గ్రాండ్ ఎంట్రీ!

హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొంతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా ప్రియమణి నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని టాక్ వినబడుతోంది. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ మెగా ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది. అభిమానులు తమ బాస్ నుండి మరో “మెగా బ్లాక్ బస్టర్” కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో జరగబోయే ఈ ఓపెనింగ్ వేడుకతో సినిమా టైటిల్, ఇతర కీలక నటీనటుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చిలో ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మెగా అభిమానులకు ఇది ఒక పండుగలాంటి వార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.