
📌 Key Points
- నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం రెండు సంవత్సరాలకే ముగిసింది.
- విడాకుల గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని నిహారిక అన్నారు.
- రెండో పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నిహారిక తెలిపారు.
- విధి రాతను నమ్ముతానని, సమయం వచ్చినప్పుడు అంతా జరుగుతుందని నిహారిక వెల్లడించారు.
మెగా డాటర్ నిహారిక తన విడాకుల గురించి, రెండో పెళ్లి గురించి తాజాగా స్పందించారు. రాకాసా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నిహారిక విడాకుల గురించి స్పందన
Niharika Konidela: ఇటీవల కాలంలో విడాకుల ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే ఇలా విడాకులు తీసుకుని విడిపోయేవారు కానీ ఇటీవల కాలంలో ఏ చిన్న భేదాభిప్రాయాలు వచ్చిన ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న విడిపోయిన వారిలో మెగా డాటర్ నిహారిక(Niharika) కూడా ఒకరు. నిహారిక తన పెద్దలు చూసిన అబ్బాయితో ఏడడుగులు వేశారు. ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య(Venkata Chaitanya) అనే అబ్బాయిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని చెప్పాలి. పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే నిహారిక చైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇక నిహారిక తన విడాకుల గురించి ఇదివరకు ఎన్నో సందర్భాలలో తెలియజేశారు అయితే ఈమె ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన తరచూ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాకాసా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న నిహారికకు మరోసారి తన విడాకుల గురించి అలాగే రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ప్రశ్న ఎదురవడంతో వెంటనే నిహారిక నాకేమైనా వయసు అయిపోయిందా ముసలి వాళ్లు కూడా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంటూ సమాధానం చెప్పారు.
రెండో పెళ్లిపై నిహారిక క్లారిటీ
తనకు రెండో పెళ్లి ఆలోచన ఉందని అయితే ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు కానీ పెళ్లి అయితే చేసుకుంటానని తెలిపారు. నేను విధి రాతను ఎక్కువగా నమ్ముతానని నా జీవితంలోకి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడే వస్తారు అంతేకానీ నేను పెళ్లికోసమే పరుగులు పెట్టనని తెలిపారు. సమయం వచ్చినప్పుడే జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా నిహారిక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీకు పెద్ద దెబ్బ తగిలింది ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందనే ప్రశ్నలు అడగడంతో వెంటనే నిహారిక ఆ దెబ్బ చాలా గట్టిగా తగిలింది అంటూ తన విడాకుల గురించి ఈమె తెలిపారు. ఒక ఫ్రెండ్ షిప్ లో విడిపోవాలి అంటే ఒక రీసన్ ఉండాలి కానీ మాకు చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇద్దరం పరస్పరా అంగీకారంతో విడిపోయాం కాబట్టి త్వరగా దాని నుంచి బయటపడగలిగాను అంటూ నిహారిక తన విడాకుల గురించి అలాగే రెండో పెళ్లి చేసుకోవడం గురించి తెలిపారు.
ఉదయ్ పూర్ లో నిహారిక వివాహం..
విడాకుల నుండి త్వరగా కోలుకున్న నిహారిక
ఇక నిహారిక ప్రేమ వివాహం కాకుండా పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం ఉదయ్ పూర్ లో చాలా ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన ఏడాది పాటు ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక దంపతులు తదుపరి విభేదాల కారణంగా విడిపోయారు. ఇక ఈ విషయం గురించి మొదట తన తండ్రికి చెప్పడంతో నాగబాబు కూడా ఇష్టం లేని చోట ఉండాల్సిన పని లేదు అంటూ తనకు సలహా ఇవ్వడంతో విడాకులు తీసుకున్నానని తెలిపారు.
నిహారిక తన జీవితంలోకి ఎవరైనా రావాలనుకున్నప్పుడే వస్తారని, పెళ్లి కోసం తొందరపడనని స్పష్టం చేశారు. విడాకుల నుండి త్వరగా కోలుకున్నానని, భవిష్యత్తులో మంచి జీవితం ఉంటుందని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.


