|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నీళ్లు, కత్తిపోట్లు… రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ షాకింగ్ ట్విస్టులు!

Published: 07-01-2026, 6:45 AM
కన్నీళ్లు, కత్తిపోట్లు... రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ షాకింగ్ ట్విస్టులు!
  • రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా జనవరి 13న విడుదల.
  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో డింపుల్, ఆశికా హీరోయిన్లు.
  • తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేమ, కుటుంబ నేపథ్యంతో ఆకట్టుకుంది.
  • ప్రభాస్, చిరంజీవి సినిమాలతో సంక్రాంతి రేసులో పోటీ.

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

రవితేజ కొత్త సినిమా విశేషాలు

BMW Trailer: మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ డింపుల్ హైయతి, ఆశికా రంగనాథ హీరో హీరోయిన్లుగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi)అనే సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి వామ్మో.. వాయ్యో అంటూ సాగిపోయే పాటను విడుదల చేయగా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.

ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే…ఇదివరకే ఒక అమ్మాయితో పెళ్లి అయిన రవితేజ మరొక అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారునే విషయాలను చూపించారు. ముందు ఎంటర్టైన్మెంట్.. తరువాతే అనౌన్స్మెంట్ అంటూ చెప్పే డైలాగులు అలాగే బ్యాక్ టు బ్యాక్ కన్నీళ్లు, కత్తిపోట్లు అంటూ వచ్చే డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే రవితేజ కచ్చితంగా హిట్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ హైలైట్స్

తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి మాత్రం రవితేజ పక్కా హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇద్దరూ హీరోయిన్ల నడుమ హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే నేపథ్యంలోనే ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న  రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చెరుకూరి సుధాకర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా విషయంలో రవితేజతో పాటు చిత్ర నిర్మాతలు కూడా చాలా ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్, చిరంజీవి వంటి వారికి పోటీగా ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా అయిన రవితేజకు సక్సెస్ వచ్చేనా? లేదంటే మరోసారి నిరాశను మిగులుస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక చివరిగా రవితేజ మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

సంక్రాంతి రేసులో సినిమా

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ చూస్తుంటే ఈసారి రవితేజ పక్కా హిట్ అందుకోవడం ఖాయం అనిపిస్తుంది. సంక్రాంతి పోటీలో ఈ చిత్రం ఎలా నిలుస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.