|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి, బాబీ మూవీ: ముహూర్తం ఖరారు! డాన్ అవతారంలో మెగాస్టార్.. వేడుక ఎప్పుడో తెలుసా?

Published: 19-01-2026, 6:00 AM
చిరంజీవి, బాబీ మూవీ: ముహూర్తం ఖరారు! డాన్ అవతారంలో మెగాస్టార్.. వేడుక ఎప్పుడో తెలుసా?
  • చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పూజా కార్యక్రమం జనవరి 25న రామానాయుడు స్టూడియోలో.
  • ఈ చిత్రంలో చిరంజీవి బెంగాల్ మాఫియా డాన్‌గా కనిపించనున్నారు.
  • చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదలైంది.
  • ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.

మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న సినిమా పూజా కార్యక్రమం జనవరి 25న జరగనుంది.

జనవరి 25న పూజా కార్యక్రమం

Chiru 158:మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అటు యాక్షన్ పర్ఫామెన్స్ తో ఇటు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చివరిగా ‘భోళాశంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన .. ఈ సినిమాతో డిజాస్టర్ ను మూట కట్టుకున్నారు. ఇక ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తో ‘బింబిసార’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ ప్రకటించారు. ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ కారణాలవల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఇక మే నెలకు ఈ సినిమాను వాయిదా వేశారు. కనీసం అప్పటికైనా ఈ సినిమా వస్తుందా? అనే అనుమానాలు మరోవైపు వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే ఈలోపు ఒక సినిమా పూర్తి చేసి.. ఆ సినిమాతో సక్సెస్ కొట్టి.. విశ్వంభర సినిమాకి మార్గం సుగమం చేద్దామని అనుకున్నారు చిరు. ఇక అందులో భాగంగానే వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ జోరు మీద ఉన్న అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే సుమారుగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ సినిమాలో నయనతార(Nayanthara ) హీరోయిన్గా నటించగా.. విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలకపాత్ర పోషించారు.

బెంగాల్ డాన్‌గా చిరంజీవి

ఈ సినిమా సక్సెస్ తో జోరు మీద ఉన్న చిరంజీవి రెండు వారాలు విశ్రాంతి తీసుకొని తన తదుపరి ప్రాజెక్టులో పాల్గొనబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆయన బాబి కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో మరోసారి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయం అందుకుంది. అయితే ఈసారి బెంగాల్ మాఫియా డాన్ గా చిరంజీవిని బాబి చూపించబోతున్నారట.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. జనవరి 25వ తేదీన రామానాయుడు స్టూడియోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక చిరు – బాబి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిరు158 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మొత్తానికైతే బెంగాల్ మాఫియా డాన్ గా చిరంజీవిని చూపిస్తానని చెబుతున్న బాబీ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

చిరంజీవి, బాబీ కాంబినేషన్ రిపీట్

మొత్తానికి చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన గత చిత్రం విజయం సాధించడంతో, ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.