|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్‌ బద్దలు.. రికార్డుల ఊచకోత! మెగాస్టార్‌ స్టామినా అంటే ఇదే!

Updated: 17-01-2026, 2:36 PM
బాక్సాఫీస్‌ బద్దలు.. రికార్డుల ఊచకోత! మెగాస్టార్‌ స్టామినా అంటే ఇదే!
  • మన శంకర వర ప్రసాద్ గారు మూవీ 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది!
  • తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన చిరంజీవి మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం.
  • ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య రికార్డును బ్రేక్ చేసిన మన శంకర వర ప్రసాద్ గారు, ఇప్పుడు సైరా పై గురి.
  • చిరంజీవి వింటేజ్ కామెడీ, యాక్షన్, స్టైల్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ & యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా.

మెగాస్టార్ చిరంజీవి తన నట విశ్వరూపం చూపిస్తున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులకు ఇది నిజంగా పండగే. ఈ సినిమా రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదు రోజుల్లోనే ఊహించని కలెక్షన్లు

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సంక్రాంతికి విడుదలై ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉండటంతో వారు క్యూ కడుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత తన వింటేజ్‌ కామెడీ, యాక్షన్‌, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు ట్రెండ్‌కి తగ్గట్టుగా డాన్స్ లు వేయడం, పంచ్‌లు వేయడంతో నేటి తరం యువత కూడా ఈ మూవీని బాగా చూస్తున్నారు.

ప్రస్తుతం `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ఆద్యంతం అలరిస్తోంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. దీనికి భారీగా కలెక్షన్లు రావడం విశేషం. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.226 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్‌ చేసిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ సాధించిన చిరంజీవి మూవీగా నిలిచింది.

చిరంజీవి కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచేనా?

ఈ సినిమా మొదటి రోజు రూ.84కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.36(టోటల్‌ రూ.120)కోట్లకుపైగా వసూలు చేసింది. మూడో రోజు రూ.32(టోటల్‌ రూ. 152)కోట్లు వసూలు చేయగా, నాల్గో రోజు రూ.38(రూ.190)కోట్లు వసూలు చేసింది. ఇక ఐదో రోజులు రూ.36కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా ఐదు రోజుల్లో ఏకంగా రూ.226కోట్లకుపైగా గ్రాస్‌ సాధించింది. షేర్‌ పరంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిందని టీమ్‌ వెల్లడించింది. ఇవన్నీ టీమ్‌ అధికారికంగా ప్రకటించిన వసూళ్లు మాత్రమే.

గతంలో సీనియర్‌ హీరోల్లో అత్యధిక కలెక్షన్లని సాధించిన మూవీస్‌ చిరంజీవి పేరుతోనే ఉన్నాయి. `వాల్తేర్‌ వీరయ్య`, `సైరా` చిత్రాలున్నాయి. దీంతోపాటు వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఉంది. తాజాగా వీటి రికార్డులను చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` క్రాస్‌ చేసినట్టుగా టీమ్‌ ప్రకటించింది. ఇక గ్రాస్‌ కలెక్షన్ల పరంగా చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య`ని బ్రేక్‌ చేసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.219కోట్లు రాబట్టగా, దాన్ని మన శంకర వర ప్రసాద్‌ గారు దాటేసింది.

సైరా రికార్డును బ్రేక్ చేసేది ఎప్పుడో తెలుసా?

ఇక ఇప్పుడు చిరంజీవి నటించిన మరో మూవీ `సైరా` టాప్‌లో ఉంది. ఇది రూ.246కోట్లు రాబట్టింది. ఈ శనివారంతో ఆ రికార్డు కూడా బ్రేక్‌ చేయబోతున్నారు చిరు. ఇక మిగిలింది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీనే ఉంది. ఈ వీకెండ్‌లో వెంకీ మూవీని కూడా ఇది దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే తెలుగులో సీనియర్స్ లో అత్యధిక కలెక్షన్లని రాబట్టిన హీరోగా చిరంజీవి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తారు.

చిరంజీవి హీరోగా, వెంకటేష్‌ స్పెషల్‌ అప్పీయరెన్స్ లో మెరిసిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు సచిన్‌ ఖేడ్కర్‌, శరత్‌ సక్సేనా, హర్ష వర్థన్‌, అభినవ్‌ గోమటం, కేథరిన్‌ థ్రేస్సా, బుల్లిరాజు(రేవంత్‌), ఊహా, శ్రీనివాస్‌ రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.