
📌 Key Points
- చిరంజీవి సినిమా చూస్తూ హైదరాబాద్‌లో ఒక అభిమాని గుండెపోటుతో మృతి చెందారు.
- కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ మరణించారు.
- సినిమా చూస్తుండగానే ఆనంద్ కుమార్ కుప్పకూలిపోయారు.
- చిరంజీవి సినిమా విడుదల వేడుకలో విషాదం చోటు చేసుకుంది.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి సినిమా చూస్తూ ఒక అభిమాని గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ సినిమా చూస్తూ కుప్పకూలి మృతి చెందారు.
థియేటర్‌లో అభిమాని గుండెపోటు మరణం
Chiranjeevi Fan dies: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది .ఇక చాలా రోజుల తర్వాత చిరంజీవి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున కోలాహల వాతావరణం ఏర్పడింది. ఇలా చిరంజీవి సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి సినిమా విడుదల సందర్భంగా ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.
చిరు సినిమా చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ఈ సినిమా చూస్తూ థియేటర్ లోనే కుప్పకూలి మృతి చెందారు. దీంతో థియేటర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ ఇవాళ ఉదయం 11:30 గంటల షో చూడటం కోసం థియేటర్ కు వెళ్లారు అయితే సినిమా చూస్తున్న సమయంలోనే ఈయన ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం గమనించిన తోటి ప్రేక్షకులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే ఆనంద్ కుమార్ గుండెపోటుతోనే మరణించారని తెలుస్తుంది.
కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో ఘటన
ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో మెగా అభిమాని మరణించారనే విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతుడు ఆనంద్ కుమార్ కు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మన శంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలోను మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ డైరెక్షన్ లో 9వ హిట్ ..
విషాదంలో చిరంజీవి అభిమానులు
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించి సందడి చేశారు. మరొక స్టార్ హీరో వెంకటేష్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఈ సినిమా తొమ్మిదవ సినిమా కావటం విశేషం ఇలా ఈయన దర్శకత్వంలో వచ్చిన తొమ్మిది సినిమాలు కూడా మంచి సక్సెస్ కావడం విశేషం.
చిరంజీవి సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటన మెగా అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆనంద్ కుమార్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.


