|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డైరెక్టర్ అనిల్ రావిపూడికి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే మైండ్ బ్లాక్!

Published: 25-01-2026, 11:35 AM
షాకింగ్: డైరెక్టర్ అనిల్ రావిపూడికి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే మైండ్ బ్లాక్!
  • చిరంజీవి నుండి అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ గిఫ్ట్: టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • సంక్రాంతి బ్లాక్‌బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలెబ్రేషన్స్ అంబరాన్ని తాకాయి.
  • మెగాస్టార్ మనస్సు దోచుకున్న అనిల్ రావిపూడి టాలెంట్: గిఫ్ట్‌ల వర్షం కురిపిస్తున్న చిరు!
  • 300 కోట్లు కొల్లగొట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’: 350 కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఏకంగా రేంజ్ రోవర్‌ను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి ప్రేమకు బహుమతి రేంజ్ రోవర్!

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదలై, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడారు. ‘ఇవాళ పొద్దున చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఓసారి ఇంటికి రా అని పిలిచారు. ఈవినింగ్ ఫంక్షన్ ఉంది దాని గురించి ఏమో అనుకుని వెళ్లాను. గతంలోనే చెప్పారు. నాకు గిఫ్ట్ ఇస్తాను అని.. చిరంజీవి గారు కాబట్టి.. ఓ రేంజ్‌లో గిఫ్ట్ ఉంటుందనుకుంటే.. ఏకంగా రేంజ్ రోవరే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనిని నేను గిఫ్ట్‌గా చూడటం లేదు. ఆయనకు నామీద ఉన్న ప్రేమగా చూస్తున్నాను’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి.. 350 కోట్ల దిశగా అడుగులేస్తుంది. ఈ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లోనూ మెగా-విక్టరీ జోడి సందడి చేసింది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలెబ్రేషన్స్!

350 కోట్ల దిశగా మెగా మూవీ!

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.