|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేష్ కోసం చిరంజీవి చేసిన పని వల్ల మరో హీరోకి అన్యాయం ?.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీ ఏంటంటే..

Published: 04-09-2025, 2:48 AM
వెంకటేష్ కోసం చిరంజీవి చేసిన పని వల్ల మరో హీరోకి అన్యాయం ?.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీ ఏంటంటే..

టాలీవుడ్ లో స్టార్ హీరోల కెరీర్ లో ఎన్నో మలుపులు ఉంటాయి. వెంకటేష్ కెరీర్ లో ‘చంటి’ సినిమా ఒక ముఖ్యమైన మలుపు. ఈ సినిమా వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది.

Key Points

1

చిరంజీవి వెంకటేష్ కోసం 'చంటి' సినిమాను సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

2

రవి రాజా పినిశెట్టి మొదట రాజేంద్ర ప్రసాద్‌కు ఈ సినిమాను అప్పగించారు.

4

వెంకటేష్ కెరీర్ లో 'చంటి' ఒక మెమొరబుల్ బ్లాక్ బస్టర్ హిట్.

చంటి సినిమా వెనుక కథ

టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరికీ కొన్ని మెమొరబుల్ హిట్ సినిమాలు ఉంటాయి. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.  అప్పట్లో వెంకీ మాస్ చిత్రాలు చేస్తూనే ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించారు. వెంకటేష్ కెరీర్ లో సంచలనం సృష్టించిన చిత్రాలలో చంటి ఒకటి. ఇది తమిళంలో తెరకెక్కిన చిన్న తంబి చిత్రానికి రీమేక్ గా రూపొందింది. రవి రాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు.

అయితే చంటి చిత్రం వెంకటేష్ కి రావడానికి చాలా పెద్ద కథ ఉంది. చిన్న తంబి తమిళ చిత్రం గురించి తెలుసుకున్న కేఎస్ రామారావు దీనిని రాజేంద్రప్రసాద్ తో తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. రవి రాజా పినిశెట్టి రాజేంద్రప్రసాద్ కి కథ కూడా చెప్పి ఒప్పించారు. రాజేంద్ర ప్రసాద్ చంటి చిత్రంలో హీరోగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అనేది వాళ్ళిద్దరి నమ్మకం.

రవిరాజా పినిశెట్టి నిర్ణయం

తమిళంలో చిన్న తంబి మూవీ రిలీజ్ మంచి హిట్ అయింది. ఆ చిత్రం గురించి తెలుసుకున్న నిర్మాత డి రామానాయుడు కే ఎస్ రామారావు ని పిలిచి ఈ చిత్రాన్ని వెంకటేష్ తో చేయమని అడిగారు. సురేష్ బాబు కూడా చంటి చిత్రాన్ని వెంకటేష్ తో చేయాలని కోరారు.

కేఎస్ రామారావు ఈ విషయాన్ని రవి రాజా పినిశెట్టికి చెప్పారు. రవి రాజా పినిశెట్టి ఏమాత్రం అంగీకరించలేదు. ఆల్రెడీ ఒక హీరోకి మాటిచ్చేసిన చిత్రాన్ని మరో హీరోతో ఎలా చేస్తాం. ఇది సరైన పద్ధతి కాదు అన్యాయం చేసినట్లు అవుతుంది అని రవిరాజా పినిశెట్టి అన్నారట. ఆ టైం లో రాజేంద్ర ప్రసాద్ కూడా వరుస హిట్ చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నారు.

చిరంజీవి పాత్ర

రవి రాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని వెంకటేష్ తో చేయడానికి ఒప్పుకోకపోవడంతో కె ఎస్ రామారావు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దించారు. చంటి చిత్రాన్ని వెంకటేష్ తో  చేసేలా చిరంజీవి ఆయన్ని ఒప్పించారు. చిరంజీవి స్వయంగా అడగడంతో రవి రాజా చెప్పిన అంగీకరించక తప్పలేదు. ఆ విధంగా వెంకటేష్ కి చంటి చిత్రం దక్కింది. వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ లో చంటి ఒకటి. ఆ మూవీలో అమాయకుడిగా వెంకటేష్ నటించిన విధానం ఆడియన్స్ ని విపరీతంగా మెప్పించింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందుగా ఖుష్బూని అనుకున్నారు. ఆమె కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం చేయలేదు. దీంతో అవకాశం మీనాకి దక్కింది.

చివరికి, చిరంజీవి జోక్యంతో వెంకటేష్ ‘చంటి’ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ కి అన్యాయం జరిగిందా అనేది ఇప్పటికీ చర్చనీయాంశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.