
📌 Key Points
- చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
- మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ విడుదలైంది.
- మారుతి, చిరంజీవి కాంబినేషన్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. దర్శకుడిపై విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం మారుతి గత సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టలేకపోవడమే.
మారుతి దర్శకత్వంలో చిరంజీవి?
Maruthi -Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది . చాలా రోజుల తర్వాత చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం చిరంజీవి తదుపరి ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈయన బాబీ డైరెక్షన్లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు అలాగే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో కూడా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో డైరెక్టర్ మారుతి(మారుతి) కూడా చిరంజీవితో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తాజాగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ (The Rajasaab)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అవకాశాన్ని అందుకున్న మారుతి అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలుస్తుంది. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన రాజాసాబ్ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరచడంతో అభిమానులు కూడా మారుతి పై విమర్శలు కురిపిస్తున్నారు.
మెగా ఫ్యాన్స్ ఆందోళన
ఇదిలా ఉండగా తాజాగా మారుతి సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. మారుతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని, అతి త్వరలోనే ఈ సినిమా అధికారక ప్రకటన రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా మారుతి డైరెక్షన్లో చిరంజీవి నటించబోతున్నారనే విషయం తెలిసిన మెగా అభిమానులు షాక్ అవుతూ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. బాస్ ఖాతాలో మరో డిజాస్టర్ మేము చూడాలనుకోలేదు అంటూ ఈ విషయంపై కామెంట్ లు పెడుతున్నారు.
విడుదలకు సిద్ధంగా విశ్వంభర..
విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్
ఇటీవల కాలంలో మారుతి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మారుతి డైరెక్షన్ లో చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల పై మెగా అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. మరి చిరంజీవి మారుతి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చినా కూడా బాబి, శ్రీకాంత్ ఓదెల సినిమాలు షూటింగ్ పూర్తి అయిన అనంతరమే మారుతి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక చిరంజీవి ఇప్పటికే వశిష్ట డైరెక్షన్ లో నటించిన విశ్వంభర సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
చిరంజీవి, మారుతి కాంబినేషన్ లో సినిమా వస్తే ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.


