|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే

Published: 12-12-2025, 12:01 AM
చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే
  • చిరంజీవి, మాధవి దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించారు.
  • మొదట్లో వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని సినీ వర్గాలలో చర్చ ఉండేది.
  • చిరంజీవి పెళ్లి తర్వాత మాధవితో వారి స్నేహం బలపడిందని సమాచారం.
  • చిరంజీవి కోసం బాలకృష్ణ సినిమా అవకాశాన్ని మాధవి తిరస్కరించింది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటి మాధవి 15 చిత్రాల్లో కలిసి నటించినా, మొదట్లో వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని సినీ వర్గాల చర్చ. అయితే, కాలక్రమేణా వారిద్దరి మధ్య వృత్తిపరమైన స్నేహం బలపడింది. ఈ ఆసక్తికర బంధం వెనుక ఉన్న కథ ఇదే.

చిరంజీవి, మాధవిల హిట్ జోడి

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటీనటులైన మెగాస్టార్ చిరంజీవి, మాధవి దాదాపుగా 15 చిత్రాలలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఇద్దరి జోడి స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. సినిమా సూపర్ హిట్ అనుకునేవారు. వీరి కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.

ఇదిలా ఉంటే.. వీరిద్దరి జోడీ 15 సినిమాల్లో కనిపించినప్పటికీ, వీరి మధ్య తెరపై అనుకున్నంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదని అప్పట్లో సినీ వర్గాలలో చర్చ ఉండేదట. తొలినాళ్లలో నటి మాధవి.. చిరంజీవి పట్ల కాస్త రిజర్వ్‌డ్‌గా ఉండేదని, పెద్దగా పట్టించుకునేది కాదని చెబుతుంటారు.

కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం?

ఈ కారణంగానే చిరంజీవి కూడా చాలా సినిమాల్లో మాధవితో కలిసి నటించేటప్పుడు కాస్త బెరుగ్గానే షూటింగ్‌లను పూర్తి చేశారట. ఒక దశలో మాధవిని తాకే ప్రయత్నం చేస్తే గుర్రున చూసేదనే సినీ వర్గాల్లో ప్రచారం కూడా సాగింది.

అయితే కాలక్రమేణా వారి మధ్య బంధం పూర్తిగా మారిందని.. ముఖ్యంగా చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం బలపడిందట. ఆ తర్వాత మాధవి చిరంజీవితో కలివిడిగా ఉండటమే కాకుండా, వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారని సమాచారం.

స్నేహంగా మారిన వృత్తి బంధం

ఇలా చిరంజీవి, మాధవిల మధ్య ఫ్రెండ్‌షిప్ వృత్తిపరంగా మారుతూ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. అటు వరుసగా మాధవి, చిరంజీవితో కలిసి సినిమాలు చేస్తుండటంతో.. బాలకృష్ణతో నటించే అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసిందని టాక్.

మొత్తానికి, చిరంజీవి, మాధవిల ప్రయాణం తెరపై మొదలైన నిశ్శబ్దం నుండి బలమైన స్నేహంగా పరిణమించింది. వారి వృత్తిపరమైన బంధం వ్యక్తిగత మైత్రిగా మారి, టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.